Tuesday, May 3, 2011

గంగా పుష్కరములు - రెండవ భాగం

కాశీలోని పురోహితుల వివరములు

చల్లా విజయ కుమార్, (లేటు చల్లా లక్ష్మణ శాస్త్రి గారి పుత్రులు)

హరిశ్చంద్ర ఘాట్ రోడ్

2275107

తులసి లక్ష్మీకాంత్ జోషి మరియు తులసి రమాకాంత్ జోషి

(లేటు తులసి శీతారాం జోషి గారి పుత్రులు), నారద ఘాటు

2455626

3455288

2450643

రాజవరపు విశ్వనాథ శాస్త్రి, క్షేమేశ్వర ఘాట్

2454218

రామ్ కుమార్జీ అండ్ సన్స్, లలితా ఘాట్

2401411


వారాణాశి వచ్చు రైళ్ళ వివరములు


అటు (ఆంధ్ర)నుండి

ఇటు నుండి

గంగా కావేరి ఎక్సుప్రెస్

విజయవాడనుండి

శని, సోమ

రాత్రి 12.20 గం.

సోమ, బుధ

రాత్రి 1.10 గం.

ఎర్నాకులం ఎక్సుప్రెస్

విజయవాడనుండి

ఆది

రాత్రి 10.00

మంగ

ఉదయం 5.30

రామేశ్వరం - వారణాశి (విజయవాడ

బుధ రా 8.20

ఆది రా. 9.30

సికింద్రాబాద్ పాట్నా

సికింద్రాబాద్ నుండి

ప్రతి రోజు

. 10.00

ప్రతి రోజు

రా. 11.30

బెంగళూరు - పాట్నా

విజయవాడనుండి ముఘల్ సరాయ్

ప్రతిరోజు

రా. 10.30 ని.

ప్రతిరోజు

రా. 11.30 ని

పూరి - ఢిల్లీ (నీలాంచల్)

భువనేశ్వరం నుండి వారణాశి

మం, శు,

. 12.25 ని

మం, శు,

రా. 9.00 గం.

పూరి - ఢిల్లీ

భువనేశ్వరం నుండి ముఘల్ సరాయ్

సో, బు, గు,

. 12.25 ని.

సో, బు, గు,

సా. 6.00 గం.

పూరి - ఢిల్లీ (పురుషోత్తమ్ ఎక్సు.)

భువనేశ్వరం నుండి ముఘల్ సరాయ్

ప్రతి రోజు

రా. 11.25

ప్రతి రోజు

. 10.20


విమాన సౌకర్యం

వారణాశి ఎయర్ పోర్టు వారణాశి నుండి 30 కి.మీ. దూరంలో బాబత్ పూర్ వద్ద ఉన్నది.

వారణాశికి ముంబైనుండి (ఇండియన్ ఎయర్ లైన్సు, కింగ్ ఫిషర్), ఢిల్లీ నుండి (ఇండియన్ ఎయర్ లైన్సు, కింగ్ ఫిషర్, జెట్ ఎయర్ వేస్ మరియు … … స్పైస్ జెట్), హైదరాబాదు నుండి (స్పైస్ జెట్) మరియు కోల్ కత్తా (జెట్ ఎయర్ వేస్ - వారమునకు 3 రోజులు) నుండి విమానములు ఉన్నవి.


ముఖ్యమయిన టెలిఫోన్ నంబర్లు

పోలీసు కంట్రోల్ రూమ్

100, 2414141

డి..జీ. (పోలీసు)

9454400217

కలెక్టర్ (డిష్ట్రిక్టు మాజిష్ట్రేట్)

2502626 / 2502727

రైల్వే ఎంక్వయిరీ - వారణాశి

139, 131

రైల్వే ఎంక్వయిరీ - ముఘల్ సరాయ్

255703, 139

ఆర్.టీ.సీ. ఎంక్వయిరీ

2203476, 2431740

బి.హెచ్.యు. హాస్పిటల్

236950 (అంబు - 230-9307, 7558)

శివప్రసాద్ గుప్తా హాస్పిటల్

2214723 (అంబు - 2214723)

హెరిటేజ్ హాస్పిటల్ (ప్రైవేటు)

2369991 – 95, 2368888


వారణాశి వాతావరణం

మే నెలలో కాశీ లో వేడిగాల్పులు వీస్తుంటాయి (దీనిని ఇక్కడ లూ అంటారు). గాలిలో తేమ ఉండదు అందువల్ల ఉక్కపోత తక్కువ ఉండును.

టెహ్రీ వద్ద గంగమీద ఆనకట్ట కట్టిన దగ్గరనుండి వేసవి కాలంలో గంగలో నీరు బాగా తగ్గిపోతోంది. ఆనకట్ట కట్టని క్రితం వేసవి కాలంలో కూడా గంగా నదిలో నీరు ప్రవహించేది. గత క్రొద్ది సంవత్సరాలగా ప్రవాహంలేక నీరు పరిశుభ్రంగా ఉండటంలేదనే ఫిర్యాదులు వస్తున్నాయి. టెహ్రీ ఆనకట్టనుండి గంగలో ఎల్లప్పుడూ నీరు ఉండేట్టుగా నీటిని వదలాలని చాలా ఆందోళనలు జరుగుతున్నాయి.

Monday, May 2, 2011

గంగా పుష్కరములు - వారణాశి

గంగా పుష్కరములు - 2011

వారణాశి


పుష్కరములకు విచ్చేయుచున్న యాత్రీకులకు

హార్ధిక శుభాకాంక్షలు


శ్రీ ఖర నామ సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమీ ఆదివారంనాడు (అనగా మే 8, 2011న ఉదయం 3.30 ని.) గురుడు మేష రాశిలో ప్రవేశించడంతో భారతీయులకు పరమ పావనమైన గంగానదికి పుష్కరములు వచ్చుచున్నవి. పన్నెండు రోజులు అనగా వైశాఖ కృష్ణ విదియ (మే 19, 2011) వరకు పుష్కరుడు గంగానదిలో ఉండడం వల్ల గంగా స్నానం మరియు పితృదేవతలకు చేయు తర్పణాదులకు విశేష ఫలితము కలుగును. కాశీలో గంగ ఉత్తర వాహినిగా ప్రవహించడంవల్ల, విశ్వేశ్వరుడు కొలువైనందువల్ల హిందువులు కాశీలో గంగా స్నానము చేయుటకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ సంవత్సర కాలము మధ్యాహ్నము 12.00 గం. లకు పుష్కరుడు గంగానదిలో ఉండుట వల్ల ఆ సమయములో చేయు స్నాన, దాన, పితృ కార్యక్రమములకు పుష్కరములలో చేసిన ఫలితమే కలుగును.

కాశీలో వసతి భోజన సౌకర్యములు కలిగిస్తున్న వివిధ సత్రముల వివరములను, పురోహితుల వివరములను కలిగిన ఒక కరపత్రమును ప్రకటించిన కాశీ వచ్చుచున్న యాత్రీకులకు అనువుగానుండు నను ఉద్దేశ్యముతో శ్రీ కాశీ తెలుగు సమితి సభ్యులు ఈ కరపత్రమును ప్రకటించుచున్నారు.

దీనిలోని వివరములు యాత్రీకులకు తమ యాత్రను విజయవంతం గాపూర్తి చేసుకోవడానికి సహకరిస్తాయని మేము ఆశిస్తున్నాము.


ఇట్లు

కార్య వర్గ సభ్యులు

శ్రీ కాశీ తెలుగు సమితి

కాశీ లోని తెలుగు వారి సత్రములు మరియు ఆశ్రమములు

అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం, బి. 14/15, మాన సరోవర్

2451953

అన్నపూర్ణ ప్రాంతీయ సేవా ఆశ్రమమము, బి. 6/112 కేదార ఘాట్, సోనార్ పురా

2277868,

6535002

కాశీ అన్నపూర్ణ యాత్రీ భవనము, బి. 14/91, మాన సరోవర్

9839050325

కాశీ ఆర్య వైశ్య వాసవీ నిత్యాన్న సత్రం

డి. 47/143 రమాపురా, మిశ్రంబు ఎదురుగా, లక్సారోడ్

2451534

శ్రీ కాశీ వైశ్య సత్ర సంఘం (గుంటూరు వైశ్య సత్రం), బి. 14/15, క్షేమేశ్వర ఘాట్

2452947

శ్రీ మార్కండేయ ఆశ్రమం, బి. 71/192 కేదార ఘాటు

9889707658

శ్రీ నిర్మల శివానంద ఆశ్రమము, బి. 15/35-C పాండే హవేలీ

2450178

శ్రీ రామతారక ఆంధ్రా ఆశ్రమము, బి. 14/92 మానసరోవర్

2450418

శ్రీ శృంగేరి శంకర మఠం, బి. 14/111 కేదార ఘాట్

2452768

శ్రీ తారక రామా నివాస్ (క్షత్రియ సత్రం), బి. 5/281 అవధ్ గర్భి, హనుమాన్ ఘాట్

2277477

శ్రీ వెల్లంపల్లి రాఘవయ్య మరియు రాఘవమ్మ కాశీ నిత్యాన్నదాన సత్రం

2452339


ఇవి కాక తమిళుల, హిందీ వారి సత్రములలో కూడా తెలుగువారికి బస ఇస్తారు. వాటిలో ముఖ్యమయినవి కుమారస్వామి మఠం (తమిళులది), కేదార ఘాట్ వద్ద పాండే ధర్మశాల, లక్సా రోడ్ మరియు హరసుందరీ ధర్మశాల, గదోలియా.

అన్నపూర్ణ మందిరములో ఉదయం 11.00 గం. నుండి సాయింత్రం 3.00 గం. వరకూ అన్నదానము జరుగుతుంది


మరిన్ని వివరములు రేపటి పోస్టులో

Tuesday, February 15, 2011

ఉపనిషద్వజ్ఞానము - చివరి భాగము

పైనక్షత్రమాలలోని మహావాక్యభావము నాకళింపుజేసికొనినవారు, వారికనువగు ఉపనిషత్తును పూర్తి పాఠము, తాత్పర్యమును జదువుకొని ఆత్మానుసంధానమునకు ప్రయత్నింపవచ్చును.

హైందవ సంస్కృతి పునరుద్ధరణకు ఉపయుక్తములగునవి, నిత్య స్వాధ్యాయనమునకు వీలగునవి, కించిత్కాల పారాయణకు సాధ్యమగునవి, ఉపనిషత్తాత్పర్యవచన సారాంశమును ఆస్తికులకు అందుబాటులోనికి తెచ్చు సత్పురుషులు గన్పట్టరైరి.

సగటు మానవాళి ఆసక్తి గల్గిననూ వారి అభిరుచికి తగిన ఉపనిషత్వచన సారాంశము నవగతము చేసికొను సామర్ధ్యము ప్రశ్నార్ధకమే. గనుక నేటి యాంత్రిక యుగమున జిజ్ఞాసులగు ముముక్షులు సమయోచితముగ అనుసంధానమునకు కేవలము 3 మంత్రములనుండి 9 మంత్రముల వరకు గల ఉపనిషత్తులనుటుంకించుట యుక్తముగా భావన.

ఉచితానుచితమును, వారి అర్హతానర్హతలను సద్గురువులద్వారా నెరింగి ఈ క్రింది వానిననుసంధానము జేయనగును.

  1. మూడు మంత్రములు మాత్రమే గల్గి కలిదోషనివారణయు సద్యోముక్తియు గల్గించు 103వదియగు కలిసంతారణోపనిషత్తు గలదని గ్రహించిన పామరుడునూ దీనిని వదలడు. షోడశాక్షరియగు హరేరామ హరేరామ రామరామ హరేహరే, హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే దీనిని నామస్మరణగా భజన గోష్ఠులు చేయుచున్నారు. కాని ఈ రెండు నామములను విడిగా చెప్పుట విచారకరము. మొత్తముగా కలిపి చేయవలయును.
  2. నాలుగు మంత్రములు మాత్రమే గల్గి పాపహరము, మృత్యుంజయమునగునది 71వదగు సూర్యోపనిషత్.

కుబేరత్వము, పాండిత్యము గల్గించు గణపత్యుపనిషత్

సహస్రగాయత్రి జపఫలితము, దశ సహస్రరుద్రజప ఫలితము నొసగునది 91వదగు తారసారోపనిషత్

చతుర్వేదపారాయణ ఫలితమొసగునది 92వదియగు మహావాక్యోపనిషత్

సర్వమంత్ర పారాయణ ఫలితమొసగునది 101వదియగు దత్తాత్రేయోపనిషత్

జన్మరాహిత్య ప్రదాత్రి 104వదియగు జాబాల్యోపనిషత్

  1. 5 మంత్రములు మాత్రమే గల్గి నారాయణ సాయుజ్య ప్రదాత్రి 18వదగు నారాయణోపనిషత్

శివసాయుజ్య ప్రదాత్రి 28వదగు కాలాగ్నిరుద్రోపనిషత్

బ్రహ్మపదమునొసగునది 100దియగు హయగ్రీవోపనిషత్

  1. 6 మంత్రములు మాత్రమే గల్గి మహాసిద్ధి నొసగునది 81వదగు శ్రీ దేవ్యుపనిషత్
  2. 7 మంత్రములు గల్గిన మోక్షప్రదాత్రి 49వదగు దక్షిణామూర్త్యుపనిషత్
  3. 8 మంత్రములు గల విష్ణు సాయుజ్య ప్రదాత్రి 56వదగు వాసుదేవోపనిషత్
  4. 9 మంత్రములు గల్గి జీవన్ముక్తి, సంసార నివృతతులను గల్గించునవి 50 వదగు శరభోపనిషత్ మరియు 53వదగు అద్వయ తారకోపనిషత్

ఇట్టి ఉపనిషత్తులను తాత్పర్య సహితముగ విడి విడిగా చిన్న పుస్తకములుగ తయారుచేసి ఆస్తిక జన బాహుళ్యమునకు అందించినచో వేదవిజ్ఞానమభివృద్ధినొంది, హైందవ సంస్కృతీ విస్తరణ, పరిరక్షణకు దోహదమగుట తథ్యము.

విజ్ఞులు, నాయీ పరిశ్రమను సదవగాహనతో పరిశీలించి తప్పులున్న యడల మన్నించి, నాకు తెల్పినయడల సర్దుబాటు చేసికొనగలను.

శ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు నూటఎనిమిది ఉపనిషత్తుల ను సంగ్రహముగా తెనిగించినట్లు తెలిపినారు। త్వరలోనే వాటిని కూడా ఇక్కడ ప్రకటిస్తాము.

ఉపనిషద్ విజ్ఞానము - 3వ భాగము

ఈ అష్టోత్తరశత ఉపనిషత్తులు మానవ సముదాయమును ఉద్ధరించుటకు మహర్షులచే నొసంగబడినవి. వీనిలో బహుళ ప్రచారములగు దశోపనిషత్తులు చాతుర్వర్ణములవారికిని, చతురాశ్రమములవారికిని ప్రయోజనకరములు కాగా మహాత్ములు, పండితులు, ప్రవచన కర్తలు వీనిని మాత్రమే ఉపన్యసించుచుండిరి. ప్రత్యేక ప్రయోజనమాశించువారలు, సూక్ష్మములో మోక్షము నాశించువారలు కనీసము తెలిసికొను ఆవశ్యకము గలదు.

వేదాంతవిద్యను బోధించు ఉపనిషత్తులు 24. యోగవిద్యను బోధించునవి 17. వైష్ణవములు 14. శైవములు 15. శాక్త్యములు 8. సన్యాస సాధకములు 17. సిద్ధాన్త సాధనములు 13. ఇవి బ్రహ్మవీద్యా బోధకములు. ఈ 108 ఉపనిషత్తులలో 11 ఋగ్వేదమునుండియు, 19 శుక్ల యజుర్వేదము నుండియు, 31 కృష్ణ యజుర్వేదమునుండియు, 16 సామవేదము నుండియు, 31 అధర్వణ వేదము నుండియు గ్రహింపబడినవి.

ఈ ఉపనిషత్తుల మూలమగు చతుర్వేదముల ద్వారా గ్రహింపబడిన నాల్గు మహావాక్యములు, సర్వసంగపరిత్యాగులై దండకమండల స్వీకారముతో సన్యాసాశ్రమ స్వీకారులకు బ్రహ్మోపదేశముగా ననుగ్రహింపబడును.

1. ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణ వాక్యము

2. తత్త్వమసి ఉపదేశ వాక్యము

3. అహం బ్రహ్మాస్మి స్వానుభవవాక్యము

4. ఆయమాత్మాబ్రహ్మ సాక్షాత్కార వాక్యము

వీనితోజేరి ఆత్మాను సంధానమునకు ప్రయత్నించు సర్వులకొరకుగాను మహావాక్య నక్షత్రమాలననుగ్రహించిరి.

మహావాక్యము

ఉపనిషత్తు

1.

ఈశావాస్యమిదం సర్వం

ఈశావాస్యోపనిషత్

2.

మనస్తత్రలయంయాతి తద్విష్ణోః పరమం పదం

నాదబిందూపనిషత్

3.

ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్

ఐతరేయోపనిషత్

4.

సర్వంఖల్విదంబ్రహ్మ

ఛాందోగ్యోపనిషత్

5.

ఏకోదేవస్సర్వభూతేషుగూఢః

కైవల్యోపనిషత్

6.

మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

అమృతబిందూపనిషత్

7.

మిత్యేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేతేనరేచయేత్

అమృతనాదోపనిషత్

8.

చిత్తఏవహి సంసారం

మైత్రేయణ్యుపనిషత్

9.

యస్మిన్సర్విమిదం ప్రోతం బ్రహ్మస్థావర జంగమం

మంత్రికోపనిషత్

10.

బ్రహ్మైవాహం సర్వవేదాన్త వేద్యం

సర్వసారోపనిషత్

11.

ప్రజ్ఞానం బ్రహ్మ

ఐతరేయోపనిషత్

12.

తత్వమసి

ఛాందోగ్యోపనిషత్

13.

అహం బ్రహ్మాస్మి

బృహదారణ్యకోపనిషత్

14.

ఆయమాత్మాబ్రహ్మ

మాండూక్యోపనిషత్

15

ఏకమేవాద్వితీయం సన్నామరూప వివర్జితం

శుకరహస్యోపనిషత్

16

ఓమి త్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభిః

ధ్యానబిందూపనిషత్

17

సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్యతే

త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్

18

యావత్‌దృష్ఠిః భృవోర్మధ్యే తావత్కాలం భయం కుతః

యోగచూడామణ్యుపనిషత్

19.

బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా

శరభోపనిషత్

20.

ఏకమేవాద్వితీయం బ్రహ్మ

పైంగలోపనిషత్

21.

అహం సచ్చిత్పరానంద బ్రహ్మైవాస్మి

మహోపనిషత్

22.

సఏష సర్వభూతాన్తరాత్మా

అధ్యోత్మోపనిషత్

23

త్యాగేనైకే అమృతత్వమానసుః

అవధూతోపనిషత్

24.

బ్రహ్మవిదాప్నోతిపరం

భస్మజాబోలోపనిషత్

25.

హరేరామ హరేరామ రామరామ హరేహరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే

కలిసంతారణోపనిషత్

26.

అస్తిభాతి ప్రియం రూపం

నామచేత్సంశ పంచకం

సరస్వతీ రహస్యోపనిషత్

27.

అశబ్ద మస్పర్శ మరూపమవ్యయం

తథారసం నిత్యమగంధవచ్చయత్

ముక్తికోపనిషత్