Showing posts with label పంచక్రోశి యాత్ర. Show all posts
Showing posts with label పంచక్రోశి యాత్ర. Show all posts

Tuesday, October 10, 2017

కాశీ పంచక్రోశి యాత్ర - మహాత్మ్యము - విశ్వనాథ అంతర్గృహ ప్రదక్షిణ యాత్ర

విశ్వనాథుని అంతర్గృహ ప్రదక్షిణ యాత్ర
శ్లో॥ పూర్వతో మణికర్ణేశో బ్రహ్మేశో దక్షిణే స్థితః
పశ్చిమే చైవ గోకర్ణో భారభూతస్తధోత్తరే ॥
తూర్పున మణికర్ణికేశ్వరుడు, దక్షిణమున బ్రహ్మేశ్వరుడు, పడమట గోకర్ణేశ్వరుడు, ఉత్తరమున భారభూతేశ్వరుడు అవధిగా గలది అంతర్గృహము.
కాశీ వాసులు ప్రతిరోజు అంతర్గృహయాత్రను చేయవలెను. ఆ విధముగా చేయలేని వారు ప్రతి సంవత్సరము పంచక్రోశీయాత్రకు ముందుగా అవశ్యము చేయవలెను.
ప్రాతఃకాల స్నానమాచరించి కాశీ విశ్వనాథ మందిరమునకు రావాలి. విశ్వనాథ, అన్నపూర్ణాదేవి, ఢుంఢి గణపతి, దండపాణి, మోద ప్రమోద దుర్ముఖ సుముఖ గణనాథ పంచవినాయకులను పూజించి విశ్వనాథుని దర్శించి, జ్ఞానవాపీ జలమును మార్జనచేసికొని వ్యాసపీఠము దగ్గర కూర్చుండి, తీర్థపురోహితునిచే అంతర్గృహయాత్రా సంకల్పమును చెప్పించికొని
అంతర్గృహస్య యాత్రాం వై కరిష్యేఽఘౌఘశాంతయే
ప్రీత్యర్థం తవ దేవదేవేశ విశ్వనాథ కృపానిధే ॥
అను మంత్రమును చదివి యాత్రను ప్రారంభించవలెను.
హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే
అని ఉచ్చరించుచూ యాత్రను చేయవలెను. యాత్రాంతమునందు కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణామాతను దర్శించి, పూజించి, జ్ఞానవాపి దగ్గర ఉత్తర సంకల్పముతో యాత్రను ముగించవలెను.
1.
శ్రీ పంచవినాయకేభ్యో నమః
విశ్వనాథ సభ
2.
శ్రీ విశ్వనాథాయ నమః
ప్రసిద్ధము
3.
శ్రీ జ్ఞానవాపీ తీర్థాయ నమః
విశ్వనాథ మందిరము వెనుక
4.
శ్రీ మణికర్ణికా తీర్థాయ నమః
మణికర్ణికా ఘాట్
5.
శ్రీ మణికర్ణికేశ్వరాయ నమః
సీ.కే. 8/12 అభయానంద మఠ్
గడ్ వాసీ టోలా
6.
శ్రీ కమలేశ్వరాయ నమః
సీ.కే. 8/14 గడ్‌వాసీ టోలా
7.
శ్రీ కంబలాశ్వతరాభ్యాం నమః
సీ.కె. 8/14 గోమఠ్‌కాకారామ్ గల్లీ
8.
శ్రీ వాసుకీశ్వరాయ నమః
సీ.కె. 7/155 సింధియా ఘాట్
9.
శ్రీ పర్వతేశ్వరాయనమః
సీ.కే. 7/156
10.
శ్రీ గంగాకేశవాయ నమః
డీ. 1/66 లలితా ఘాట్‌పై
11.
శ్రీ లలితా దైవ్యై నమః
డీ. 1/67 లలితా ఘాట్‌పై
12.
శ్రీ జరాసంధేశ్వరాయ నమః
డీ. 5/100 త్రిపురభైరవ ఘాట్ పై


ప్రాచీనము లుప్తము. ప్రస్తుతము ఆశా వినాయక మందిరము నందు
13.
శ్రీ సోమనాథేశ్వరాయ నమః
డీ. 16/34 మానమందిరఘాట్
14.
శ్రీ అదాలభేశ్వరాయ నమః
మానమందిర ఘాట్
15.
శ్రీ శూలటంకేశ్వరాయనమః
దశాశ్వమేథఘాట్
16.
శ్రీ వారాహేశ్వరాయ నమః
డీ. 17/111 ప్రయాగ ఘాట్
17.
శ్రీ బ్రహ్మేశ్వరాయ నమః
డీ. 33/67 ఖాలిస్‌పురా
18.
శ్రీ అగస్తీశ్వరాయ నమః
డీ. 36/11 అగస్త్యకుండ్
19.
శ్రీ కశ్యపేశ్వరాయ నమః
డీ. 35/12 జంగమవాడీ మఠ్ దగ్గర
20.
శ్రీ హరికేశేశ్వరాయ నమః
డీ. 35/12 జంగమవాజడీ మఠ్‌కు ఎదురు సందులో ఖారీకూపం
21.
శ్రీ వైద్యనాథేశ్వరాయ నమః
డీ. 50/20 కోదఈ చౌకీ, కాజీపురా
22.
శ్రీ గోకర్ణేశ్వరాయ నమః
డీ. 50/20 కోదఈ చౌకీ
23.
శ్రీ ధ్రువేశ్వరాయ నమః
డీ. 46/10 నఈసడక్ , సనాతన ధర్మ కాలేజి
24.
శ్రీ హాటకేశ్వరాయ నమః
సీ.కే. 48/260 హాడ్‌హా సరాయ్
25.
శ్రీ అస్థిక్షేప తటాకేశ్వరాయ నమః
సీ.కే. 48/44 రాజా దర్వాజా
26.
శ్రీ కీకసేశ్వరాయనమః
సీ.కే. 48/44 రాజా దర్వాజా
27.
శ్రీ భారభూతేశ్వరాయ నమః
సీ.కే. 54/4 మచ్ఛరహట్టా ఫాటక్, రాజాదర్వాజా
28.
శ్రీ చిత్రగుప్తేశ్వరాయ నమః
సీ.కే. 47/66 రేశమ్ కటరా
29.
శ్రీ చిత్రఘంటాదుర్గా దేవ్యైనమః
సీ.కే. 33/34 చందు నాఊ గల్లీ, చౌక్‌కు వెనుక
30.
శ్రీ పశుపతీశ్వరాయ నమః
సీ.కె. 13/66 పశుపతీశ్వర గల్లీ
31.
శ్రీ పితామహేశ్వరాయ నమః
సీ.కే. 73/1సిద్ధేశ్వరీ, శీతలా గల్లీ
32.
శ్రీ కలశేశ్వరాయ నమః
సీ.కే. 7/10 సిద్ధేశ్వరీ
33.
శ్రీ చంద్రేశ్వరాయ నమః
సీ.కే. 7/124 సిద్ధేశ్వరీ
34.
శ్రీ ఆత్మావీరేశ్వరాయ నమః
సీ.కే. 7/158 సింధియా ఘాట్
35.
శ్రీ విద్యేశ్వరాయ నమః
సీ.కె. 2/49 సిద్ధేశ్వరీ
36.
శ్రీ అగ్నీశ్వరాయ నమః
సీ.కె. 2/1 పటనీ టోలా
37.
శ్రీ నాగేశ్వరాయ నమః
సీ.కె. 1/21 పటనీ టోలా
38.
శ్రీ హరిశ్చంద్రేశ్వరాయ నమః
సీ.కె. 7/166 సంకటాజీ ఘాట్
39.
శ్రీ చింతామణి వినాయకాయ నమః
సీ.కె. 7/161 వశిష్ఠేశ్వరుని ద్వారము దగ్గర
40.
శ్రీ సేనా వినాయకాయ నమః
అక్కడే సంకటాజీ పరిక్రమ మార్గము పై
41.
శ్రీ వశిష్ఠ వామదేవాభ్యాం నమః
సీ.కే. 7/161సంకటాజీ మార్గం లో
42.
శ్రీ కరుణేశ్వరాయ నమః
సీ.కె. 34/10 లాహిరీ టోలా - లలితా ఘాట్ మార్గములో
43.
శ్రీ త్రిసంధ్యేశ్వరాయ నమః
సీ.కే. 34/10లాహిరీ టోలా
44.
శ్రీ విశాలాక్షీ గౌర్యై నమః
మీర్ ఘాట్
45.
శ్రీ ధర్మేశ్వరాయ నమః
డీ. 2/13 ధర్మకూప్, మీర్ ఘాట్
46.
శ్రీ విశ్వభుజా గౌరీ దేవ్యై నమః
డీ. 2/13ధర్మకూప్, మీర్ ఘాట్
47.
శ్రీ ఆశా వినాయకాయ నమః
డీ. 3/79 మీర్ ఘాట్
48.
శ్రీ వృద్ధాదిత్యాయ నమః
డీ. 3/16 మీర్ ఘాట్
49.
శ్రీ చతుర్వక్త్రేశ్వరాయ నమః
డీ. 7/16 శకర్‌కంద్ గల్లీ
50.
శ్రీ బ్రాహ్మీశ్వరాయ నమః
డీ. 7/6, శకర్‌కంద్ గల్లీ
51.
శ్రీ మనః ప్రకామేశ్వరాయ నమః
డీ. 10/50 సాక్షి వినాయకునకు ఎదురుగా
52.
శ్రీ ఈశానేశ్వరాయ నమః
భాంస్ ఫాటక్
53.
శ్రీ చండీచండీశ్వరాయనమః
డీ. 8/26 కాళికా గల్లీ
54.
శ్రీ భవానీ శంకరాభ్యాం నమః
అన్నపూర్ణ మందిరములోని రామమందిరములో జగన్నాథుని ప్రక్కన
55.
శ్రీ ఢుంఢిరాజాయనమః
ప్రసిద్ధము సావిత్రీ పాటక్
56.
శ్రీ రాజరాజేశ్వరాయ నమః
సీ.కె. 35/33 ఢుంఢి రాజు గల్లీ
57.
శ్రీ లాంగలీశ్వరాయ నమః
సీ.కే. 20/41 ఖోవా బజార్
58.
శ్రీ నకులీశ్వరాయ నమః
(1) అక్షయవటము దగ్గర
(2) ఢుంఢిరాజు తరువాత మేడపైన పంచముఖ వినాయకుని దగ్గర
59.
శ్రీ పరాన్నేశ్వరాయ నమః
ఢుంఢిరాజు గల్లీ - దండపాణికి ఎదురుగా ఇంట్లో
60.
శ్రీ పరద్రవ్యేశ్వరాయ నమః
61.
శ్రీ ప్రతిగ్రహేశ్వరాయ నమః
62.
శ్రీ నిష్కలంకేశ్వరాయ నమః
సీ.కే. 35/34, దండపాణికి ఎదురుగా ఇంట్లో
63.
శ్రీ మార్కండేశ్వరాయ నమః
ఢుంఢిరాజు గల్లీ, దండపాణి ప్రక్కన
64.
శ్రీ అప్సరేశ్వరాయ నమః
జ్ఞానవాపి 4 వ గేటు నుండి వెళ్ళునప్పుడు రాధాకృష్ణ ధర్మశాలలో
65.
శ్రీ గంగేశ్వరాయ నమః
మసీదుకు తూర్పున రావి చెట్టు క్రింద
66.
శ్రీ జ్ఞాన వాప్యై నమః
జ్ఞానవాపి జలముతో స్నానముగాని మార్జనగాని చేసి కొని జ్ఞానవాపిని పూజించవలెను.



అనంతరము నందికేశ్వరుని, తారకేశ్వరుని, మహాకాళేశ్వరుని, దండపాణిని, మహేశ్వరుని, మోక్షేశ్వరుని, వీరభద్రేశ్వరుని, అవిముక్తేశ్వరుని, పంచ వినాయకులను, కాశీ విశ్వనాథుని దర్శించి పూజించవలెను.
వ్యాసపీఠము దగ్గర కూర్చుండి ఆచార్యుని ద్వారా సంపూర్ణయాత్రా దేవతల నామములను చెప్పించుకొని అక్షతలు జలము విడువవలెను.
శ్లో॥ అంతర్గృహస్య యాత్రేయం యథావద్యా మయా కృతా
న్యూనాతిరిక్తయా శంభుః ప్రీయతామనయా విభుః ॥
అని శివుని ప్రార్థించి, శక్త్యనుసారముగా అచార్యునకు దక్షిణ భోజనముల నొసంగవలెను.

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - నిత్య యాత్ర

నిత్యయాత్ర (కాశీ ఖండము 100 వ అధ్యాయము)
యాత్రికులు ప్రథమముగా మణికర్ణికయందు స్నానమును చేయవలెను. పిమ్మట దేవర్షి పితృతర్పణములను చేసి బ్రాహ్మణులను యాచకులను సంతృప్తి పరచవలెను.


1.
ద్రౌపదాదిత్య
విశ్వనాథుని సందులో హనుమాన్ మందిర సమీపమందలి అక్షయవటము దగ్గర
2.
ద్రౌపది
అక్కడే
3.
విష్ణువు
విశ్వనాథుని మందిరపు ఆవరణలో
4.
దండపాణి
ఢుంఢిరాజు వీధిలోని పంచక్రోశీదండపాణి
5.
మహేశ్వరుడు
జ్ఞానవాపికి పశ్చిమ దక్షిణ కోణమందు రావి చెట్టు క్రింద
6.
ఢుంఢి గణపతి
ప్రసిద్ధమగు అన్నపూర్ణా మందిర మార్గమున మొదట – సావిత్రీ ఫాటక్
7.
జ్ఞానవాపి
ప్రసిద్ధము - జ్ఞానవాపీజలమును త్రాగి ఆచమించవలెను
8.
నందికేశ్వరుడు
జ్ఞానవాపికి తూర్పున పెద్దనంది (నందికేశ్వరుడు లుప్తము)
9.
తారకేశ్వరుడు
జ్ఞానవాపికి తూర్పునగల పెద్ద నందికి తూర్పున గౌరీశంకరులకు క్రింద రావి చెట్టు క్రింద
10.
మహాకాళేశ్వరుడు
జ్ఞానవాపి దగ్గర వ్యాసపీఠమున కెదురుగాగల రావిచెట్టు క్రింద
11.
దండపాణి
ఢుంఢిరాజు వీధిలో
12.
శ్రీకాశీవిశ్వేశ్వరుడు
ప్రసిద్ధము



శ్లో॥ దైనందినీ విధాతవ్యా మహాఫల మభీప్సుభిః
తతో వైశ్వేశ్వరీయాత్రా కార్యా సర్వార్థ సిద్ధిదా ॥
మహాఫలమును కోరు కాశీ వాసులు సర్వార్ధములను సిద్ధింపజేయునట్టి యీ నిత్య యాత్రను అవశ్యము చేయవలెను.


Wednesday, September 20, 2017

పంచక్రోశి కాశీ యాత్ర - మాహాత్మ్యము - ఏడవ భాగము

యాత్రకు అవసరమగు వస్తువులు
గంగాజలము, మారేడు దళమలు, వక్కలు - 10, పూలు, ధవళాక్షతలు, నేయి, తెల్ల నువ్వులు (1/4 కిలో) (రామేశ్వరుని పూజకు), నల్ల నువ్వులు (5 మజిలీలందు తర్పణమునకు), పసుపు, కుంకుమ, పంచదార గుళ్లు, దుర్గాదేవికి, భీమచండీదేవికి రెవిక, కొబ్బరికాయ, దేహలీ వినాయకునకు తుండు గుడ్డ, అక్కడున్న 16 వినాయకులకు తెల్ల నువ్వుల లడ్లు 16, యవల పిండి 1 కిలో, దర్భలు, విస్తళ్లు (కపిల ధార దగ్గర పిండ ప్రదానము చేయువారికి మాత్రము) సుమారు రూపాయి చిల్లర నాణెములు 200, మోయనలు (స్వయంపాకములు) ఇచ్చు చోట్ల, ప్రధాన మందిరములందు దక్షిణలిచ్చు నిమిత్తము చిల్లర నోట్లు, వర్షము వచ్చినచో ఉపయోగించుటకు రెండు మైనపు కాగితములు, బ్యాటరీ లైటు, మైనపు వత్తులు, పంచదార, అటుకులు, గ్లూకోజ్ ప్యాకెట్, నిమ్మకాయలు వగైరా సొంత అవసరాలకు, చలికాలమునందు కంబళ్లు, ఉన్ని దుస్తులు, నేలపై శయనించుటకు చాప, యూప సరోవరము దగ్గర యధాశక్తిగా దానమొనర్చుటకు బంగారము, ధనము, యవలు (1/2 కిలో) (యవ వినాయకుని యొద్దనుండి సప్తావరణ వినాయకుని వరకు "శ్రీ విష్ణవే నమః" అని చెప్పుచూ చల్లుటకు), జ్ఞానవాపి దగ్గర 2, సప్తావరణ, యవ వినాయకుల దగ్గర 2, దేహలీ వినాకుని దగ్గర 1, అయిదు మజిలీలందు 5, మొత్తం 10 మోయనలు (బ్రాహ్మణ భోజనములకు బియ్యము, పెసరపప్పు, కూర వగైరా స్వయంపాకములు).
సూచన : ఈ వస్తువులను యాత్రకు బయలు దేరుటకు ముందుగా సిద్ధపరచు కొనవలెను.

Saturday, September 16, 2017

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - మూడవ భాగము

పంచక్రోశీయాత్ర ఎప్పుడు చేయాలి?

మహాదేవ ఉవాచ
శ్లో॥ అశ్విన్యాదిషు మాసేషు త్రిషు పార్వతి సర్వదా
ప్రదక్షిణా కర్తవ్యా క్షేత్ర స్యాపాప కాంక్షిభిః
మాఘాది చతురోమాసాః ప్రోక్తా యాత్రా విధౌ నృణామ్ ॥
ఓ పార్వతి! ఆశ్వయుజ, కార్తీక, మార్గశీర్ష, మాఘ, ఫాల్గుణ, చైత్ర, వైశాఖ మాసములందు పంచక్రోశ యాత్రను చేయుట మంచిది. (బ్ర. వై. పు., కాశీ రహస్యం)

శ్లో॥ యథా కథంచిత్ దేవేశి! పంచక్రోశ ప్రదక్షిణమ్
కుర్యాదేవ న మాసాది చింతయేద్ధర్మ కోవిదః
స ఏవ శుభదః కాలో యస్మిన్ శ్రద్ధోదయో భవేత్ ॥
శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధావంతులు నెలలతో నిమిత్తము లేకుండ ఎప్పుడైననూ పంచక్రోశ యాత్ర చేయవచ్చును.

గమనిక : కాశీవాసులగు ఆంధ్రులు సామాన్యముగ కార్తీక, ఫాల్గుణ మాసములందు పంచక్రోశ యాత్రను చేయుచున్నారు. అనగా దక్షిణాయణమునందొకసారి, ఉత్తరాయణమునందొకసారి చేయుచున్నారు.

క్షేత్ర సన్యాసుల కర్తవ్యము

శ్లో॥ విధిస్తు పూర్వమేవోక్తో నియమాదియుత స్తవ
ప్రదక్షిణాత్రయం తేషాం అవధారయ సువ్రతే ॥ (. పు.)
ఓ పార్వతీ! క్షేత్రమునందుండు సన్యాసులు అందరివలె విధి నియమములను పాటించుచు కాశీ ప్రదక్షిణను చేయవలెను. వారు మూడు పర్యాయములు ప్రదక్షిణను అవశ్యమాచరింపవలెను. అంతకంటె అధికముగ చేసినచో చాల మంచిది. మూడు సార్లకంటె తక్కువ కాకుండ శ్రద్ధ వహింపవలెను.

Saturday, September 9, 2017

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్రా మాహాత్మ్యము - రెండవ భాగము

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్రా మాహాత్మ్యము

శ్లో॥ కాశ్యాం తిష్ఠతి యోనిత్యం స్నాతి భాగీరథీ జలే
కుర్యాత్ సాంవత్సరీ యాత్రాం పంచక్రోశస్య సుందరి ॥
శ్లో॥ వారాణసీం సమాసాద్య ప్రమాదాద్యో బహిర్గతః
స దైవాత్పునరాగత్య ప్రదక్షిణేన శుద్ధ్యతి ॥ (బ్ర.వై.పు.)

ఓ పార్వతీ! కాశీయందు నివసించుచు నిత్యము గంగా స్నానమును చేయువారు కూడ సంవత్సరమునకొకసారి పంచక్రోశ యాత్రను చేయవలెను. ఎందువలననంటే కాశీవాసి ప్రమాదవశమున గాని, ఏదో కారణముచేత గాని కాశీని విడిచి బయటికి వెళ్లును. తిరిగి కాశీ ప్రవేశించినంతనే పంచక్రోశ ప్రదక్షిణ వలన శుద్ధుడగును.
ఒకనాడు జైగీషవ్యముని "ఓ కుమారస్వామీ! కాశీయందు ప్రమాదమువలన చేసిన చిన్న పెద్ద పాపముల నుండి విముక్తిని కల్గించు సులభోపాయమును తెలుపుము" అని అడుగగా కుమారస్వామి యిట్లు పల్కెను-

శ్లో॥ ప్రాయశ్చిత్తవిహీనానాం, న శాన్తిః కుత్రచిద్భవేత్
కింపునః కాశికామధ్యే పాపం కృత్వా సుఖం లభేత్॥
ప్రాయశ్చిత్తములు చేయనివారికి పాపములు శాంతించవు. ముక్తి క్షేత్రమగు కాశియందు పాపములను చేసినవారు ప్రాయశ్చిత్తము సేయక ఎట్టి పరిస్థితులందును సుఖమును పొందరు.

శ్లో॥ బ్రహ్మహత్యాది పాపానాం ప్రాయశ్చిత్తం హి కాశికా
కాశికాయాం కృతే పాపే ప్రాయశ్చిత్తం నవిద్యతే ॥
బ్రహ్మహత్యాది పాపములకు ప్రాయశ్చిత్తము కాసీ నివాసము. కాశీ కృత పాపములకు ప్రాయశ్చిత్తము లేదు.

శ్లో॥ ప్రాయశ్చిత్త విహీనానాం యాతనాస్తి సుదారుణా
జ్ఞాన స్వరూపా కాశీయం, పంచక్రోశే పరిస్థితా ॥
శ్లో॥ తస్యాః ప్రదక్షిణం కృత్వా సర్వపాపైః ప్రముచ్యతే
ప్రాయశ్చిత్తమును చేయనివారు రుద్ర పిశాచ రూపమై సుదారుణమగు భైరవ యాతనలను అనుభవించుదురు. కాని జ్ఞాన స్వరూపయగు కాశీ ప్రదక్షిణము గావించిన వారు సర్వపాపములనుండి విముక్తులగుదురు.

శ్లో॥ మమ బ్రహ్మమయం లింగం ఆపాతాలాత్ సముపస్థితమ్
శివలోకోపరిగతమ్ అత్యతిష్ఠద్దశాంగులమ్ ॥
పాతాళ లోకమునుండి బయటికి వచ్చిన బ్రహ్మమయ మగు విశ్వేశ్వరలింగము శివలోకముపైన పది అంగుళముల వరకు వ్యాపించియున్నది. ఈ పంచక్రోశ పరిమాణముగల కాశియందు సర్వత్రవ్యాప్తమైయున్నది.


శ్లో॥ ఆజన్మ సంచితైః పాపైః ముచ్యతే తత్ప్రదక్షిణాత్
క్షేత్రే కృతానాం పాపానాం ప్రాయశ్చిత్తం న చేతరం ॥
ఒక్క పంచక్రోశీ కాశీ ప్రదక్షిణమువలన జన్మ ప్రభృతి కావించిన పాపములనుండి విముక్తిని పొందుదురు. కాశీ కృత పాపములకు దీనికంటె భిన్నమగు ప్రాయశ్చిత్తము లేదు.

శ్లో॥ దక్షిణే చోత్తరేచైవ హ్యయనే సర్వదా మయా
క్రియతే క్షేత్రదాక్షిణ్యం భైరవస్య భయాదపి ॥ (. సం.)
ఓ పార్వతీ! నేను (శివుడు) భైరవ భయముచే దక్షిణ ఉత్తరాయణములందు సంవత్సరమున రెండు సార్లు పంచక్రోశీ ప్రదక్షిణ యాత్రను చేయుదును.

శ్లో॥ ప్రదక్షిణ ద్వయం కృత్వా దశజన్మ కృతాదఘాత్
ముక్తో భవతి పాపాత్మా సద్యో మోక్ష మవాప్నుయాత్ ॥
రెండు ప్రదక్షిణలు చేయుట వలన దశ జన్మ కృతపాపముల నుండి విముక్తులై వెంటనే ముక్తులగుదురు.

శ్లో॥ ప్రదక్షిణ త్రయం కృత్వా పాపం జన్మశతార్జితమ్
విలయం ప్రాపయతి నో నాత్రకార్యా విచారణా ॥
ప్రదక్షిణ త్రయమొనర్చుటవలన శతజన్మ కృత పాపములనుండి విముక్తులగుదురు. ఏ మాత్రము సందేహము లేదు.

శ్లో॥ యావజ్జీవం వసేత్ కాశ్యాం ప్రత్యబ్దం సుప్రదక్షిణమ్
క్షేత్రం ప్రదక్షిణీ కృత్య భవేత్పాపో హి విజ్వరః ॥
యావజ్జీవము కాశీయందు నివసించవలెను. ప్రతి సంవత్సరము అలసత్వమును వీడి ఆనందవనమగు కాశీకి ప్రదక్షిణమును చేసి పాపరహితులు కావలెను.

శ్లో॥ ప్రత్యబ్దం యే ప్రకుర్వంతి పంచక్రోశ ప్రదక్షిణామ్
జీవన్ముక్తాస్తు తే జ్ఞేయాః నిష్పాపాః కాశి వాసినః ॥
ప్రతి సంవత్సరము పంచక్రోశీ ప్రదక్షిణ గావించు కాశీ వాసులు జీవన్ముక్తులు, పాప రహితులు.

శ్లో॥ కాశీ ప్రదక్షిణా యేన కృతా త్రైలోక్య పావనీ
సప్తద్వీపా సాబ్ధి శైలా భూః పరిక్రామితాఽమునా ॥
ఓ పార్వతీ! త్రైలోక్య పావనియగు కాశీ ప్రదక్షిణను చేసిన వారు సప్తద్వీపములు, సప్త సముద్రములు, పర్వతములతో కూడిన భూమిని ప్రదక్షిణించిన వారితో సమానులు. వారు సర్వపాపవిముక్తులై జన్మరహితులై శివసాయుజ్యమును పొందుదురు.