Tuesday, October 10, 2017

పంచక్రోశీ కాశీ ప్రదక్షిణ యాత్ర - మహాత్మ్యము

కాశీ పంచక్రోశి యాత్ర - మహాత్మ్యము - సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీర్వాద శ్రీముఖము



ఆశీర్వాద శ్రీముఖము
కాశీ పరిక్రమ విధానమును గురించి బ్రహ్మశ్రీ మల్లాది శ్రీహరి శాస్త్రిగారు సమగ్ర సుందరమైన గ్రంథమును రచించారు. ఈ అంశాన్ని వివరిస్తూ లోగడ కొన్ని రచనలు వచ్చినవి. కాని వీరి రచన అన్ని విశేషాలతో సర్వాంగీణంగా, సులభంగా, సుబోధకంగా ఉంది. ఉత్తర భారతంలో పరిక్రమ అనే పదాన్ని దక్షిణ భారతంలో ప్రదక్షిణం అంటారు.
తెలుగువారి కోసం తెలుగులో వ్రాసినది గనుక ప్రదక్షిణ యాత్ర అనే పదాన్నే శాస్త్రిగారు ఉపయోగించారు. గడచిన కొన్ని దశాబ్దాలుగా మల్లాది వారు బాగా తెలిసిన వారు. హిందూ ధర్మం కోసం జీవితం అంకితం చేసిన వ్యక్తి. సమర్థులైన పౌరాణికులు. బహు గ్రంథరచయిత. ఇప్పుడు వ్రాసిన గంథంవంటి ప్రజోపయోగకర గ్రంథాలు మరిన్ని వీరి లేఖిని నుండి రావాలని ఆశీర్వదిస్తున్నాను.
ఈ గ్రంథానికి ప్రేరకులు, కారకులు – వారాణాసి లోని సుప్రసిద్ధ శ్రీరామ తారక ఆంధ్రాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వేమూరి వేంకట సుందర శాస్త్రి గారు. ఆంధ్ర యాత్రికులకు అనుపమానమైన పార సేవ చేస్తున్న సహృదయులు. సంస్కార సంపన్నులు. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షీ వల్లభుడు వీరికి, వీరికుటుంబానికి శుభములు ప్రసాదించును గాక!
నారాయణ స్మరణతో
07.08.3027 -శ్రావణ పూర్ణిమ
వారణాసి                                                                                                                                                 సిద్ధేశ్వరానందభారతీస్వామి

కాశీ పంచక్రోశి యాత్ర - మహాత్మ్యము - విశ్వనాథ అంతర్గృహ ప్రదక్షిణ యాత్ర

విశ్వనాథుని అంతర్గృహ ప్రదక్షిణ యాత్ర
శ్లో॥ పూర్వతో మణికర్ణేశో బ్రహ్మేశో దక్షిణే స్థితః
పశ్చిమే చైవ గోకర్ణో భారభూతస్తధోత్తరే ॥
తూర్పున మణికర్ణికేశ్వరుడు, దక్షిణమున బ్రహ్మేశ్వరుడు, పడమట గోకర్ణేశ్వరుడు, ఉత్తరమున భారభూతేశ్వరుడు అవధిగా గలది అంతర్గృహము.
కాశీ వాసులు ప్రతిరోజు అంతర్గృహయాత్రను చేయవలెను. ఆ విధముగా చేయలేని వారు ప్రతి సంవత్సరము పంచక్రోశీయాత్రకు ముందుగా అవశ్యము చేయవలెను.
ప్రాతఃకాల స్నానమాచరించి కాశీ విశ్వనాథ మందిరమునకు రావాలి. విశ్వనాథ, అన్నపూర్ణాదేవి, ఢుంఢి గణపతి, దండపాణి, మోద ప్రమోద దుర్ముఖ సుముఖ గణనాథ పంచవినాయకులను పూజించి విశ్వనాథుని దర్శించి, జ్ఞానవాపీ జలమును మార్జనచేసికొని వ్యాసపీఠము దగ్గర కూర్చుండి, తీర్థపురోహితునిచే అంతర్గృహయాత్రా సంకల్పమును చెప్పించికొని
అంతర్గృహస్య యాత్రాం వై కరిష్యేఽఘౌఘశాంతయే
ప్రీత్యర్థం తవ దేవదేవేశ విశ్వనాథ కృపానిధే ॥
అను మంత్రమును చదివి యాత్రను ప్రారంభించవలెను.
హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే
అని ఉచ్చరించుచూ యాత్రను చేయవలెను. యాత్రాంతమునందు కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణామాతను దర్శించి, పూజించి, జ్ఞానవాపి దగ్గర ఉత్తర సంకల్పముతో యాత్రను ముగించవలెను.
1.
శ్రీ పంచవినాయకేభ్యో నమః
విశ్వనాథ సభ
2.
శ్రీ విశ్వనాథాయ నమః
ప్రసిద్ధము
3.
శ్రీ జ్ఞానవాపీ తీర్థాయ నమః
విశ్వనాథ మందిరము వెనుక
4.
శ్రీ మణికర్ణికా తీర్థాయ నమః
మణికర్ణికా ఘాట్
5.
శ్రీ మణికర్ణికేశ్వరాయ నమః
సీ.కే. 8/12 అభయానంద మఠ్
గడ్ వాసీ టోలా
6.
శ్రీ కమలేశ్వరాయ నమః
సీ.కే. 8/14 గడ్‌వాసీ టోలా
7.
శ్రీ కంబలాశ్వతరాభ్యాం నమః
సీ.కె. 8/14 గోమఠ్‌కాకారామ్ గల్లీ
8.
శ్రీ వాసుకీశ్వరాయ నమః
సీ.కె. 7/155 సింధియా ఘాట్
9.
శ్రీ పర్వతేశ్వరాయనమః
సీ.కే. 7/156
10.
శ్రీ గంగాకేశవాయ నమః
డీ. 1/66 లలితా ఘాట్‌పై
11.
శ్రీ లలితా దైవ్యై నమః
డీ. 1/67 లలితా ఘాట్‌పై
12.
శ్రీ జరాసంధేశ్వరాయ నమః
డీ. 5/100 త్రిపురభైరవ ఘాట్ పై


ప్రాచీనము లుప్తము. ప్రస్తుతము ఆశా వినాయక మందిరము నందు
13.
శ్రీ సోమనాథేశ్వరాయ నమః
డీ. 16/34 మానమందిరఘాట్
14.
శ్రీ అదాలభేశ్వరాయ నమః
మానమందిర ఘాట్
15.
శ్రీ శూలటంకేశ్వరాయనమః
దశాశ్వమేథఘాట్
16.
శ్రీ వారాహేశ్వరాయ నమః
డీ. 17/111 ప్రయాగ ఘాట్
17.
శ్రీ బ్రహ్మేశ్వరాయ నమః
డీ. 33/67 ఖాలిస్‌పురా
18.
శ్రీ అగస్తీశ్వరాయ నమః
డీ. 36/11 అగస్త్యకుండ్
19.
శ్రీ కశ్యపేశ్వరాయ నమః
డీ. 35/12 జంగమవాడీ మఠ్ దగ్గర
20.
శ్రీ హరికేశేశ్వరాయ నమః
డీ. 35/12 జంగమవాజడీ మఠ్‌కు ఎదురు సందులో ఖారీకూపం
21.
శ్రీ వైద్యనాథేశ్వరాయ నమః
డీ. 50/20 కోదఈ చౌకీ, కాజీపురా
22.
శ్రీ గోకర్ణేశ్వరాయ నమః
డీ. 50/20 కోదఈ చౌకీ
23.
శ్రీ ధ్రువేశ్వరాయ నమః
డీ. 46/10 నఈసడక్ , సనాతన ధర్మ కాలేజి
24.
శ్రీ హాటకేశ్వరాయ నమః
సీ.కే. 48/260 హాడ్‌హా సరాయ్
25.
శ్రీ అస్థిక్షేప తటాకేశ్వరాయ నమః
సీ.కే. 48/44 రాజా దర్వాజా
26.
శ్రీ కీకసేశ్వరాయనమః
సీ.కే. 48/44 రాజా దర్వాజా
27.
శ్రీ భారభూతేశ్వరాయ నమః
సీ.కే. 54/4 మచ్ఛరహట్టా ఫాటక్, రాజాదర్వాజా
28.
శ్రీ చిత్రగుప్తేశ్వరాయ నమః
సీ.కే. 47/66 రేశమ్ కటరా
29.
శ్రీ చిత్రఘంటాదుర్గా దేవ్యైనమః
సీ.కే. 33/34 చందు నాఊ గల్లీ, చౌక్‌కు వెనుక
30.
శ్రీ పశుపతీశ్వరాయ నమః
సీ.కె. 13/66 పశుపతీశ్వర గల్లీ
31.
శ్రీ పితామహేశ్వరాయ నమః
సీ.కే. 73/1సిద్ధేశ్వరీ, శీతలా గల్లీ
32.
శ్రీ కలశేశ్వరాయ నమః
సీ.కే. 7/10 సిద్ధేశ్వరీ
33.
శ్రీ చంద్రేశ్వరాయ నమః
సీ.కే. 7/124 సిద్ధేశ్వరీ
34.
శ్రీ ఆత్మావీరేశ్వరాయ నమః
సీ.కే. 7/158 సింధియా ఘాట్
35.
శ్రీ విద్యేశ్వరాయ నమః
సీ.కె. 2/49 సిద్ధేశ్వరీ
36.
శ్రీ అగ్నీశ్వరాయ నమః
సీ.కె. 2/1 పటనీ టోలా
37.
శ్రీ నాగేశ్వరాయ నమః
సీ.కె. 1/21 పటనీ టోలా
38.
శ్రీ హరిశ్చంద్రేశ్వరాయ నమః
సీ.కె. 7/166 సంకటాజీ ఘాట్
39.
శ్రీ చింతామణి వినాయకాయ నమః
సీ.కె. 7/161 వశిష్ఠేశ్వరుని ద్వారము దగ్గర
40.
శ్రీ సేనా వినాయకాయ నమః
అక్కడే సంకటాజీ పరిక్రమ మార్గము పై
41.
శ్రీ వశిష్ఠ వామదేవాభ్యాం నమః
సీ.కే. 7/161సంకటాజీ మార్గం లో
42.
శ్రీ కరుణేశ్వరాయ నమః
సీ.కె. 34/10 లాహిరీ టోలా - లలితా ఘాట్ మార్గములో
43.
శ్రీ త్రిసంధ్యేశ్వరాయ నమః
సీ.కే. 34/10లాహిరీ టోలా
44.
శ్రీ విశాలాక్షీ గౌర్యై నమః
మీర్ ఘాట్
45.
శ్రీ ధర్మేశ్వరాయ నమః
డీ. 2/13 ధర్మకూప్, మీర్ ఘాట్
46.
శ్రీ విశ్వభుజా గౌరీ దేవ్యై నమః
డీ. 2/13ధర్మకూప్, మీర్ ఘాట్
47.
శ్రీ ఆశా వినాయకాయ నమః
డీ. 3/79 మీర్ ఘాట్
48.
శ్రీ వృద్ధాదిత్యాయ నమః
డీ. 3/16 మీర్ ఘాట్
49.
శ్రీ చతుర్వక్త్రేశ్వరాయ నమః
డీ. 7/16 శకర్‌కంద్ గల్లీ
50.
శ్రీ బ్రాహ్మీశ్వరాయ నమః
డీ. 7/6, శకర్‌కంద్ గల్లీ
51.
శ్రీ మనః ప్రకామేశ్వరాయ నమః
డీ. 10/50 సాక్షి వినాయకునకు ఎదురుగా
52.
శ్రీ ఈశానేశ్వరాయ నమః
భాంస్ ఫాటక్
53.
శ్రీ చండీచండీశ్వరాయనమః
డీ. 8/26 కాళికా గల్లీ
54.
శ్రీ భవానీ శంకరాభ్యాం నమః
అన్నపూర్ణ మందిరములోని రామమందిరములో జగన్నాథుని ప్రక్కన
55.
శ్రీ ఢుంఢిరాజాయనమః
ప్రసిద్ధము సావిత్రీ పాటక్
56.
శ్రీ రాజరాజేశ్వరాయ నమః
సీ.కె. 35/33 ఢుంఢి రాజు గల్లీ
57.
శ్రీ లాంగలీశ్వరాయ నమః
సీ.కే. 20/41 ఖోవా బజార్
58.
శ్రీ నకులీశ్వరాయ నమః
(1) అక్షయవటము దగ్గర
(2) ఢుంఢిరాజు తరువాత మేడపైన పంచముఖ వినాయకుని దగ్గర
59.
శ్రీ పరాన్నేశ్వరాయ నమః
ఢుంఢిరాజు గల్లీ - దండపాణికి ఎదురుగా ఇంట్లో
60.
శ్రీ పరద్రవ్యేశ్వరాయ నమః
”
61.
శ్రీ ప్రతిగ్రహేశ్వరాయ నమః
”
62.
శ్రీ నిష్కలంకేశ్వరాయ నమః
సీ.కే. 35/34, దండపాణికి ఎదురుగా ఇంట్లో
63.
శ్రీ మార్కండేశ్వరాయ నమః
ఢుంఢిరాజు గల్లీ, దండపాణి ప్రక్కన
64.
శ్రీ అప్సరేశ్వరాయ నమః
జ్ఞానవాపి 4 వ గేటు నుండి వెళ్ళునప్పుడు రాధాకృష్ణ ధర్మశాలలో
65.
శ్రీ గంగేశ్వరాయ నమః
మసీదుకు తూర్పున రావి చెట్టు క్రింద
66.
శ్రీ జ్ఞాన వాప్యై నమః
జ్ఞానవాపి జలముతో స్నానముగాని మార్జనగాని చేసి కొని జ్ఞానవాపిని పూజించవలెను.



అనంతరము నందికేశ్వరుని, తారకేశ్వరుని, మహాకాళేశ్వరుని, దండపాణిని, మహేశ్వరుని, మోక్షేశ్వరుని, వీరభద్రేశ్వరుని, అవిముక్తేశ్వరుని, పంచ వినాయకులను, కాశీ విశ్వనాథుని దర్శించి పూజించవలెను.
వ్యాసపీఠము దగ్గర కూర్చుండి ఆచార్యుని ద్వారా సంపూర్ణయాత్రా దేవతల నామములను చెప్పించుకొని అక్షతలు జలము విడువవలెను.
శ్లో॥ అంతర్గృహస్య యాత్రేయం యథావద్యా మయా కృతా
న్యూనాతిరిక్తయా శంభుః ప్రీయతామనయా విభుః ॥
అని శివుని ప్రార్థించి, శక్త్యనుసారముగా అచార్యునకు దక్షిణ భోజనముల నొసంగవలెను.

పంచక్రోశీ కాశీ యాత్ర - మహాత్మ్యము - నిత్య యాత్ర

నిత్యయాత్ర (కాశీ ఖండము 100 వ అధ్యాయము)
యాత్రికులు ప్రథమముగా మణికర్ణికయందు స్నానమును చేయవలెను. పిమ్మట దేవర్షి పితృతర్పణములను చేసి బ్రాహ్మణులను యాచకులను సంతృప్తి పరచవలెను.


1.
ద్రౌపదాదిత్య
విశ్వనాథుని సందులో హనుమాన్ మందిర సమీపమందలి అక్షయవటము దగ్గర
2.
ద్రౌపది
అక్కడే
3.
విష్ణువు
విశ్వనాథుని మందిరపు ఆవరణలో
4.
దండపాణి
ఢుంఢిరాజు వీధిలోని పంచక్రోశీదండపాణి
5.
మహేశ్వరుడు
జ్ఞానవాపికి పశ్చిమ దక్షిణ కోణమందు రావి చెట్టు క్రింద
6.
ఢుంఢి గణపతి
ప్రసిద్ధమగు అన్నపూర్ణా మందిర మార్గమున మొదట – సావిత్రీ ఫాటక్
7.
జ్ఞానవాపి
ప్రసిద్ధము - జ్ఞానవాపీజలమును త్రాగి ఆచమించవలెను
8.
నందికేశ్వరుడు
జ్ఞానవాపికి తూర్పున పెద్దనంది (నందికేశ్వరుడు లుప్తము)
9.
తారకేశ్వరుడు
జ్ఞానవాపికి తూర్పునగల పెద్ద నందికి తూర్పున గౌరీశంకరులకు క్రింద రావి చెట్టు క్రింద
10.
మహాకాళేశ్వరుడు
జ్ఞానవాపి దగ్గర వ్యాసపీఠమున కెదురుగాగల రావిచెట్టు క్రింద
11.
దండపాణి
ఢుంఢిరాజు వీధిలో
12.
శ్రీకాశీవిశ్వేశ్వరుడు
ప్రసిద్ధము



శ్లో॥ దైనందినీ విధాతవ్యా మహాఫల మభీప్సుభిః
తతో వైశ్వేశ్వరీయాత్రా కార్యా సర్వార్థ సిద్ధిదా ॥
మహాఫలమును కోరు కాశీ వాసులు సర్వార్ధములను సిద్ధింపజేయునట్టి యీ నిత్య యాత్రను అవశ్యము చేయవలెను.


Wednesday, September 20, 2017

పంచక్రోశి కాశీ యాత్ర - మాహాత్మ్యము - తొమ్మిదవ భాగము

5రాత్రుల పంచక్రోశీ యాత్ర
1వ రోజు యాత్ర
యాత్రకు బయలుదేరు రోజునందు సూర్యోదయముకంటె ముందుగా ప్రాతఃకాలమునందు గంగా స్నానమును చేయవలెను. తరువాత విశ్వేశ్వరునకు మూడు సార్లు ప్రదక్షిణలు చేసి, సాష్టాంగ దండప్రణామములను చేయవలెను. యథా శక్తిగ పూజించవలెను. అనంతరము ముక్తి మండపమందున్న – అనగా విశ్వనాథుని సభయందలి - మోద, ప్రమోద, సుముఖ, దుర్ముఖ అను పేర్లు గల నల్గురు వినాయకులను జ్ఞానవాపి యొద్దగల గణనాథ వినాయకుని (మొత్తము అయిదుగురు వినాయకులు), దండ పాణిని (శ్రీ విశ్వేశ్వరునకు ఎదురుగానున్న మందిరమునందు), కాల భైరవుని (విశ్వేశ్వరుని మందిరపు దక్షిణ ద్వారమునకు ఎదురుగా) ఆ తరువాత అన్నపూర్ణా మాతను దర్శించి పూజించవలెను. పిమ్మట జ్ఞానవాపి మండపమందలి వ్యాసపీఠము వద్ద సంకల్పము చెప్పించుకొని, అచ్చటి బ్రాహ్మణునకు దక్షిణ, భోజనమునకు స్వయంపాకమును సమర్పించి క్రింది ప్రతిజ్ఞా మంత్రములను పఠింపవలెను.
శ్లో ॥ పంచ క్రోశస్య యాత్రాం వై కరిష్యే విధి పూర్వకమ్
ప్రీత్యర్థం తవ దేవేశ సర్వాఘౌఘ ప్రశాంతయే ॥
శ్లో॥ కాశ్యాం ప్రజాత వాక్కాయ మనోజనితముక్తయే
జ్ఞాతాఽజ్ఞాత విముక్త్యర్థం పాతకేభ్యో హితాయచ ॥
శ్లో॥ పంచక్రోశాత్మకం లింగం జ్యోతీరూపం సనాతనమ్
భవానీ శంకరాభ్యాం చ లక్ష్మీశ్రీశ విరాజితమ్ ॥
శ్లో॥ ఢుంఢి రాజాది గణపైః షట్పంచాశద్భిరావృతమ్
ద్వాదశాదిత్య సహితం నృసింహైః కేశవైర్యుతమ్ ॥
శ్లో॥ కృష్ణ రామత్రయ యుతం కూర్మ మత్స్యాదిభిస్తథా
అవతారై రనేకైశ్చ యుతం విష్ణోః శివస్యచ ॥
శ్లో॥ గౌర్యాది శక్తిభిర్జుష్టం క్షేత్రం కుర్యా త్ప్రదక్షిణమ్
బద్ధ్వాంజలిం ప్రార్థయీత మహాదేవం మహేశ్వరమ్ ॥
అని సంకల్పమును చెప్పించుకొనవలెను. పిమ్మట అక్కడి నుండి మౌనముగా మణికర్ణికకు చేరవలెను. మణికర్ణికా ఘాటులో స్నానమును గాని ప్రోక్షణగాని చేసికొని, మెట్లపైగల సిద్ధి వినాయకుని, ఆ పైన గల మణికర్ణికేశ్వరుని దర్శించి, పూజించి యాత్రను ప్రారంభించవలెను.
పంచక్రోశాత్మకాయ, మహాలింగాయ, జ్యోతిర్లింగ స్వరూపాయ,
కాశీ విశ్వేశ్వరాయ, శ్రీ శివాయ నమః
అను శ్లోకమును తరువాతి మజిలీ చేరువరకు మార్గములో చదువుచుండవలెను. మణికర్ణికనుండి అస్సీ ఘాట్ వరకు కాలినడకన గంగాతీరమందలి పంచక్రోశీమార్గ దేవతలను దర్శించుచూ వెళ్లవలెను. కాని ప్రస్తుతము పడవలో వెళ్ళుచూ, ఆయా దేవతలను స్మరించి ధవళాక్షతలను సమర్పించుచూ వెళ్లుట శిష్టాచారముగా నున్నది.
మణికర్ణికా ఘాట్ నుండి అస్సీఘాట్ వరకు
1.
ఓం మణికర్ణికేశ్వరాయ నమః
మణికర్ణికా ఘాట్
2.
ఓం సిద్ధి వినాయకాయ నమః
”
3.
ఓం గంగా కేశవాయ నమః
లలితా ఘాట్
4.
ఓం లలితా గౌరీ దేవ్యై నమః
”
5.
ఓం జరాసంధేశ్వరాయ నమః
త్రిపురభైరవీ ఘాట్ - ఆశా వినాయకుని మందిరమందు
6.
ఓం సోమనాధేశ్వరాయ నమః
మానమందిర్ ఘాట్
7.
ఓం దాలభేశ్వరాయ నమః
”
8.
ఓం శూల టంకేశ్వరాయ నమః
దశాశ్వమేధ ఘాట్
9.
ఓం వారాహేశ్వరాయ నమః
”
10.
ఓం బందీ దైవ్యై నమః
”
11.
ఓం దశాశ్వమేధేశ్వరాయ నమః
దశాశ్వమేధ ఘాట్ - శీతలా దేవి మందిరమునందు
12.
ఓం సర్వేశ్వరాయ నమః
పాండేయ్ ఘాట్ పైన
13.
ఓం కేదారేశ్వరాయ నమః
కేదార్ ఘాట్
14.
ఓం హనుమదీశ్వరాయ నమః
హనుమాన్ ఘాట్
15.
ఓం అర్క వినాయకాయ నమః
తులసీ ఘాట్ పై
16.
ఓం లోలార్క సూర్యాయ నమః
లోలార్క కుండ్, భదైనీ
17.
ఓం అస్సీ సంగమేశ్వరాయ నమః
అస్సీ ఘాట్



అస్సీ ఘాట్‌లో పడవ దిగి స్నానమును గాని ప్రోక్షణమును గాని చేసికొని, నడచుకొంటూ దుర్గా దేవి మందిరమునకు వెళ్ల వలెను. అక్కడ దుర్గావినాయకుని, దుర్గా కుండమును, దుర్గాదేవిని దర్శించి పూజించ వలెను. దుర్గాదేవికి రెవిక, నైవేద్యము (కొబ్బరికాయ) దక్షిణను సమర్పించి క్రింది పునర్దర్శన శ్లోకమును చెప్పుకొనవలెను.
18.
ఓం దుర్గా వినాయకాయ నమః
దుర్గాకుండ్
19.
ఓం దుర్గా దేవ్యై నమః
”
20.
ఓం దుర్గా కుండాయ నమః
”



శ్లో॥ జయ దుర్గే మహాదేవి! జయ కాశీనివాసిని!
క్షేత్ర విఘ్నహరే దేవి పునర్దర్శన మస్తుతే ॥
మరల అక్కడినుండి అసీ ఘాట్‌నకు మరలి వచ్చి, పూర్వ యాత్రా మార్గమును కలుపు కొనుచూ, పంచక్రోశీ మార్గములో రోడ్డుకు ఎడమవైపున నడచుచూ యాత్రను కొనసాగించవలెను.
21.
ఓం విష్వక్సేనేశ్వరాయ నమః
కరమైతాపూర్ గ్రామము (హిందూ విశ్వవిద్యాలయమునకు ముందు)



మొదటి మజిలీ కర్దమేశ్వరుడు.
ధూళి దర్శనమును చేసికొని, వసతి ప్రదేశమునకు వెళ్లవలెను. అనంతరము కర్దమేశ్వర తీర్థములో స్నానమొనర్చి, పితరులనుద్దేశించి తిల తర్పణాదులను చేయవలెను. తరువాత అక్కడి దేవతా మూర్తులను దర్శించి పూజించవలెను. కర్దమేశ్వరునకు అభిషేకమును చేయవలెను.


22.
ఓం ఆది కర్దమేశ్వర తీర్థాయ నమః
కందవా గ్రామము
23.
ఓం సోమనాథేశ్వరాయ నమః
”
24.
ఓం విరూపాక్షగణాయ నమః
”
25.
ఓం నీలకంఠేశ్వరాయ నమః
”
26.
ఓం కర్దమేశ్వరాయ నమః
”
27.
ఓం కర్దమ కూపాయ నమః
”



ఇచ్చట కర్దమ కూపములో తన ముఖ ప్రతిబింబమును చూచుట సంప్రదాయము. మధ్యాహ్నమునందు హవిషాన్నమునుతిని, సాయం సమయమున స్తోత్రపారాయణలు, భజనలతో కాలక్షేపము చేయవలెను.
2 వ రోజు యాత్ర
ప్రాతః కాలమున స్నానాదులను ముగించుకొని, ఆ మజిలీయందలి దేవతలను దర్శించి, క్రింది పునర్దర్శన మంత్రమును చదివి
శ్లో॥ కర్దమేశ మహాదేవ కాశీవాసి జనప్రియ
త్వత్పూజనాన్మహాదేవ పునర్దర్శన మస్తుతే ॥
పంచక్రోశాత్మకాయ, మహాలింగాయ, జ్యోతిర్లింగ స్వరూపాయ,
కాశీ విశ్వేశ్వరాయ, శ్రీ శివాయ నమః
అని పల్కుచు 2వ రోజు యాత్రను ఆరంభించవలెను.






రెండవ మజిలీ భీమచండికి వెళ్లు మార్గములో దేవతలు
28.
ఓం నాగనాధేశ్వరాయ నమః
అమరా గ్రామము
29.
ఓం చాముండా దేవ్యై నమః
”
30.
ఓం మోక్షేశ్వరాయ నమః
దేహనా గ్రామము
31.
ఓం కరుణేశ్వరాయ నమః
”
32.
ఓం వీరభద్ర గణాయ నమః
”
33.
ఓం వికటాక్ష దుర్గా దేవ్యై నమః
”
34.
ఓం ఉన్మత్త భైరవాయ నమః
దేఉరా గ్రామము
35.
ఓం నీలకంఠ గణాయ నమః
”
36.
ఓం కాలకూట గణాయ నమః
”
37.
ఓం విమలాదుర్గా దేవ్యై నమః
”
38.
ఓం మహా దేవేశ్వరాయ నమః
”
39.
ఓం నందికేశ్వరాయ నమః
”
40.
ఓం భృంగీరీటగణాయ నమః
”
41.
ఓం గణప్రియేశ్వరాయ నమః
”
42.
ఓం విరూపాక్ష గణాయ నమః
గౌరా గ్రామము
43.
ఓం యక్షేశ్వరాయ నమః
చక్ మాతల్ దేఈ గ్రామము
44.
ఓం విమలేశ్వరాయ నమః
ప్రయాగ్‌పుర గ్రామము
45.
ఓం మోక్షేశ్వరాయ నమః
”
46.
ఓం జ్ఞానదేశ్వరాయ నమః
”
47.
ఓం అమృతేశ్వరాయ నమః
అసవారీ గ్రామము
48.
ఓం గంధర్వ సాగర భీమచండీ తీర్థాయ నమః
భీమచండీ గ్రామము
49.
ఓం నరకార్ణవతార శివాయ నమః
”
50.
ఓం గంధర్వేశ్వరాయ నమః
”
51.
ఓం భీమచండ వినాయకాయ నమః
”
52.
ఓం రవిరక్తాక్ష గంధర్వాయ నమః
”
53.
ఓం భీమచండీ దేవ్యై నమః
”



ఇక్కడ గంధర్వ సాగర తీర్థమందు స్నానమును చేసి, భీమచండీ దేవికి రవిక, పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, దక్షిణ సమర్పించి, అభిషేకము, పితృశ్రాద్ధ తర్పణాదులను చేసి, చండ వినాయక, రవిరక్తాక్ష గంధర్వ, నరకార్ణవ తారక శివులను పూజించవలెను. అనంతరము హవిషాన్న భోజనము, సత్సంగాదులు చేయవలెను.
3 వ రోజు యాత్ర
ప్రాతః కాలమునందు స్నానాదులను ముగించుకొని, భీమచండిని దర్శించి, క్రింది పునర్దర్శన శ్లోకమును పఠించి తృతీయ దిన యాత్రను ప్రారంభించవలెను.

శ్లో॥ భీమ చండి! ప్రచండాని! మమ విఘ్నాని నాశయ !
నమస్తేస్తు గమిష్యామి పునర్దర్శనమస్తుతే ॥
మూడవ మజిలీ రామేశ్వరము. భీమచండీ - రామేశ్వరము మధ్యగల దేవతా మూర్తులు
54.
ఓం ఏకపాదశివగణాయ నమః
కచనార్ గ్రామము
55.
ఓం మహాభీమగణాయ నమః
హరపుర గ్రామము
56.
ఓం భైరవాయ నమః
హరశోత్ గ్రామము
57.
ఓం భైరవీ దేవ్యై నమః
”
58.
ఓం భూతనాథేశ్వరాయ నమః
దీన్ దాస్ పుర గ్రామము
59.
ఓం సింధు సరోవరాయ నమః
”
60.
ఓం సోమనాథేశ్వరాయ నమః
లంగోటియా హనుమాన్ జీ
61.
ఓం కాలనాథేశ్వరాయ నమః
జన్సా గ్రామము
62.
ఓం కపర్దీశ్వరాయ నమః
”
63.
ఓం కామేశ్వరాయ నమః
చౌఖండీ గ్రామము
64.
ఓం గణేశ్వరాయ నమః
”
65.
ఓం వీరభద్ర శివగణాయ నమః
”
66.
ఓం చారుముఖ శివగణాయ నమః
”
67.
ఓం గణనాథేశ్వరాయ నమః
భటౌలీ
68.
ఓం దేహలీ వినాయకాయ నమః
”



ఇక్కడ 16 వినాయకులు గలరు. ఈ షోడశ వినాయకులను పూజించి, తెల్లనువ్వు లడ్డులను నివేదించి, మంచినీళ్లు త్రాగి 15 నిముషములు విశ్రమించవలెను.
69.
ఓం ఉద్దండ వినాయకాయ నమః
భూఇలీ గ్రామము
70.
ఓం ఉత్కలేశ్వరాయ నమః
”
71.
ఓం రుద్రాణీ దేవ్యై నమః
రుద్రాణి తపోభూమి, హీరమపురము


రుద్రాణి తపోభూమి యందు జపము సిద్ధి ప్రదము. యధాశక్తి జపమును చేయదగును.
72.
ఓం రామేశ్వర తీర్థాయ నమః
రామేశ్వరము, వరణానదీ తీర్థము
73.
ఓం సోమేశ్వరాయ నమః
”
74.
ఓం భరతేశ్వరాయ నమః
”
75.
ఓం లక్ష్మణేశ్వరాయ నమః
”
76.
ఓం శత్రుఘ్నేశ్వరాయ నమః
”
77.
ఓం ద్యావాభూమీశ్వరాయ నమః
”
78.
ఓం నహుషేశ్వరాయ నమః
”
79.
ఓం రామేశ్వరాయ నమః
”



మూడవ మజిలీయగు రామేశ్వరమందు వరుణానదిలో స్నానము, పితృ తర్పణ శ్రాద్ధాదులను యథానుకూలముగ చేయవలెను. అక్కడి భరతేశ్వరాదులను దర్శించి పూజించవలెను. రామేశ్వరుని తెల్ల నువ్వులు, మారేడు దళములు, గంగా జలముతో అభిషేకించి, నివేదనలు సమర్పించి దక్షిణలిచ్చుకొనవలెను (రామేశ్వరునకు గంగా జలాభిషేకం విశేష ఫలప్రదము. సాయంత్రం సత్సంగాదులతో కాలక్షేపము).
4 వ రోజు యాత్ర
ప్రాతః కాలమునందు స్నానాదులను ముగించుకొని, రామేశ్వరుని దర్శించి, పూజించి, క్రింది పునర్దర్శన శ్లోకమును పఠించి యాత్రారంభము సేయవలెను.
శ్లో॥ శ్రీ రామేశ్వర రామేణ పూజితస్త్వం సనాతన
ఆజ్ఞాం దేహి మహాదేవ పునర్దర్శన మస్తుతే ॥
రామేశ్వరము - శివపురముల మధ్య గల దేవతా మూర్తులు
80.
ఓం అసంఖ్యాత శివలింగేశ్వరాయ నమః
వరుణా తీరములో - రామేశ్వరము
81.
ఓం దేవ సంధ్యేశ్వరాయ నమః
కరౌమా గ్రామము
82.
ఓం ద్రౌపదీదేవ్యై నమః
శివపురము
83.
ఓం ద్రౌపదీశ్వరాయ నమః
”
84.
ఓం యుధిష్ఠిరేశ్వరాయ నమః
”
85.
ఓం భీమేశ్వరాయ నమః
”
86.
ఓం అర్జునేశ్వరాయ నమః
”
87.
ఓం నకులేశ్వరాయ నమః
”
88.
ఓం సహదేవేశ్వరాయ నమః
”
89.
ఓం కృష్ణేశ్వరాయ నమః
”
90.
ఓం పరీక్షితేశ్వరాయ నమః
”
91.
ఓం కున్తీశ్వరాయ నమః
”
92.
ఓం ద్రౌపదీ కూపాయ నమః
”



4వ మజిలీ యగు శివపురిలో ద్రౌపదీ కూపమునందు స్నానమొనర్చి, పితృతర్పణాదులొనర్చి, ద్రౌపదీదేవిని, ద్రౌపదీశ్వరాదులను దర్శించి పూజించవలెను. సాయంత్రము సత్సంగాదులతో కాలమును గడుపవలెను.
5 వ రోజు యాత్ర
ప్రాతః కాలమునందు స్నానాదులను ముగించికొని శివపురిలోని దేవతామూర్తులను దర్శించి, క్రింది పునర్దర్శన శ్లోకమును పఠించి యాత్రను ప్రారంభించ వలెను.
శ్లో॥ పాండవేశ మహాదేవ పాండునందన పూజిత
తవ పూజాం కరిష్యామి పునర్దర్శనమస్తుతే ॥



5 వ మజిలీ కపిలధార
శివపురి - కపిలధార మధ్యగల దేవతా మూర్తులు
93.
ఓం పాశపాణి వినాయకాయ నమః
కంటోన్మెంట్ ఏరియా - సదర్ బజార్
94.
ఓం పృధ్వీశ్వరాయ నమః
ఖజురీ బజార్
95.
ఓం స్వర్గభూమి దేవ్యైనమః
సారంగతాలాబ్
96.
ఓం యూపసరోవర తీర్థాయ నమః
దీనదయాళ్‌పుర్
97.
(ఇక్కడ తీర్థ ప్రోక్షణ, సువర్ణదానాదులు)
98.
యూపసరోవరేశ్వరాయ నమః
దీనదయాళ్‌పుర్
99.
ఓం వృషభధ్వజ తీర్థాయ నమః
కపిల ధార
100.
ఓం వృషభధ్వజేశ్వరాయ నమః
”


5వ మజిలీయగు కపిలధారయందు, కపిలధారా తీర్థమున స్నానము, పితృదేవతలనుద్దేశించి పిండ శ్రాద్ధ తర్పణాదులు అవశ్యము సేయవలెను. వృషభధ్వజేశ్వరునకు అభిషేకము చేయవలెను. ప్రాంగణమందలి దేవతామూర్తులను దర్శించి, కపిల తీర్థమునకు ప్రదక్షిణము సేయవలెను. అమావాస్యతో కూడిన సోమవారమునందు ఇక్కడ శ్రాద్ధము గయా శ్రాద్ధముకంటె అధిక ఫలప్రదము. పిమ్మట సాయంకాలమునందు సత్సంగాదులు. కపిల తీర్థమునకు గల (1) మధుస్రవా, (2) కృతకృత్యా, (3) క్షీరనీరధి, (4) వృషధ్వజతీర్థ, (5) పైతామహ తీర్థ, (6) గంగాధరతీర్థ, (7) పితృతీర్థ, (8) కపిల ధార, (9) సుధాఖని, (10) శివగయా అను నామములను ఉచ్చరించుట వలన పితృదేవతలు సంతృప్తిని పొందుదురు.
6 వ రోజు యాత్ర
ప్రాతః కాలమునందు స్నానాదికములను నిర్వర్తించి, వృషభధ్వజుని దర్శించి, పూజించి క్రింది పునర్దర్శన శ్లోకమును పఠించి యాత్రను కొనసాగించవలెను.
శ్లో॥ వృషభధ్వజ దేవేశ పితౄణాం ముక్తిదాయక
ఆజ్ఞాం దేహి మహాదేవ! పునర్దర్శన మస్తుతే ॥
101.
ఓం జ్వాలా నృసింహాయ నమః
కోటవా గ్రామము
102.
ఓం యవ వినాయకాయ నమః
గంగాతీరమునందు



ఈ యవ వినాయకునకు 5 గుప్పిళ్లు యవలు సమర్పించి బ్రాహ్మణునకు మోయన (స్వయంపాకము), దక్షిణ ఈయవలెను.
గమనిక : ఇక్కడినుండి పడవపై వెళ్లువారు ఓం శ్రీ విష్ణవే నమః అని పలుకుచూ కొద్ది కొద్దిగా యవలు చల్లుచూ వరుణా గంగా సంగమమువరకు వెళ్లవలెను. అక్కడ పడవను దిగి స్నానమును చేసి అక్కడి దేవతా మూర్తులను దర్శించి పూజించాలి.
103.
ఓం వరుణా గంగా సంగమ తీర్థాయ నమః
ఆది కేశవ
104.
ఓం గంగా వరుణా సంగమేశ్వరాయ నమః
”
105.
ఓం ఆదికేశవ విష్ణవే నమః
”
106.
ఓం జ్ఞానకేశవాయ నమః
”
107.
ఓం ఖర్వవినాయకాయ నమః
”



అనంతరము పడవనెక్కి గంగా తీరమందలి దేవతా మూర్తులను స్మరించుచూ ఓం శ్రీ విష్ణవే నమః యని యవలు చల్లుచు మణికర్ణిక వరకు వెళ్లవలెను.
108.
ఓం ప్రహ్లాదేశ్వరాయ నమః
ప్రహ్లాద్ ఘాట్
109.
ఓం త్రిలోచనేశ్వరాయ నమః
త్రిలోచన ఘాట్
110.
ఓం బిందుమాధవ విష్ణవే నమః
పంచగంగా ఘాట్
111.
ఓం గభస్తీస్వరాయ నమః
మంగళాగౌరీ మందిరం
112.
ఓం మంగళాగౌరీ దేవ్యై నమః
”
113.
ఓం వశిష్ఠేశ్వరాయ నమః
సింధియా ఘాట్
114.
ఓం వామదేవేశ్వరాయ నమః
”
115.
ఓం పర్వతేశ్వరాయ నమః
”



మణికర్ణికా ఘాట్ లో పడవ దిగి క్రింది దేవతా మూర్తులను దర్శించాలి.
116.
ఓం మహేశ్వరాయ నమః
మణికర్ణికా ఘాట్
117.
ఓం సిద్ధి వినాయకాయ నమ
”
118.
ఓం సప్తావరణ వినాయకాయ నమః
బ్రహ్మనాళ్



సప్తావరణ వినాయకునకు మిగిలిన యవలను సమర్పించవలెను. అచ్చట బ్రాహ్మణునకు మోయన (స్వయంపాకము), దక్షిణలిచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానమును చేయవలెను. అనంతరము విశ్వనాథుని మందిరమునకు రావలెను.
గమనిక : యవ వినాయకునినుండి నడచివచ్చు వారు వరణా నదిని దాటి, ఆది కేశవుని యొద్ద పాదోదక తీర్థమున స్నానమొనర్చి, అక్కడినుండి గంగా తీరమందలి చూడవలసిన దేవతా మూర్తులను దర్శించి పూజించుచూ మణికర్ణికా ఘాట్ వరకు రావలెను.
119.
ఓం విష్ణవే నమః
అన్నపూర్ణా మందిరం
120.
ఓం ఢుంఢి రాజాయనమః
ఢుంఢిరాజ గల్లీ - సావిత్రీ పాటక్
121.
ఓం దండపాణయే నమః
ఢుంఢిరాజ గల్లీ
122.
ఓం సాక్షీ వినాయకాయ నమః
సాక్షి వినాయక
123.
ఓం ద్రౌపదాదిత్యాయ నమః
అన్నపూర్ణ గల్లీ
(అక్షయ వటము దగ్గర)
124.
ఓం మోదాది పంచవినాయకేభ్యో నమః
విశ్వనాథ సభ
(ముక్తి మండపము)
125.
ఓం విశ్వనాథాయ నమః
విశ్వనాథ మందిరము



విశ్వనాథునకు మరల మరల నమస్కరించి క్రింది విధముగా ప్రార్థించవలెను.
శ్లో॥ జయ విశ్వేశ విశ్వాత్మన్ కాశీ నాథ జగద్గురో
త్వత్ప్రసాదాత్ మహాదేవ! కృతా క్షేత్ర ప్రదక్షిణా ॥
శ్లో॥ అనేక జన్మ పాపాని కృతాని మమ శంకర
గతాని పంచ క్రోశాత్మ లింగస్యాస్య ప్రదక్షిణాత్ ॥
శ్లో॥ త్వద్భక్తిం కాశివాసంచ రాహిత్యం పాప కర్మణామ్
సత్సంగ శ్రవణాద్యైశ్చ కాలో గచ్ఛతు నః సదా ॥
శ్లో॥ హర శంభో మహాదేవ సర్వజ్ఞ సుఖదాయక
ప్రాయశ్చిత్తం సునిర్వృత్తం పాపానాం త్వత్ప్రసాదతః॥
శ్లో॥ పునః పాపమతిర్నాస్తు ధర్మబుద్ధి స్సదాస్తుమే
పంచక్రోశస్య యాత్రేయం యథా శక్తి మయాకృతా ॥



అనంతరము జ్ఞానవాపి సమీపమందు వ్యాసపీఠము దగ్గర కూర్చుండి పంచక్రోశ ప్రదక్షిణయందు దర్శించిన గణ దేవతలను స్మరించి, అక్షతలు సమర్పించి, అచ్చటి బ్రాహ్మణునిచే ఉత్తర సంకల్పమును చెప్పించుకొని, మోయన (స్వయంపాకము), దక్షిణలు సమర్పించవలెను.
ఆ పిమ్మట కాలభైరవుని దర్శించి తమ నివాసస్థలమున కేగవలెను. ఆరోజున గానీ, వీలైనంత త్వరలో గాని యధా శక్తి బ్రాహ్మణ భోజనాదులను ఏర్పాటు చేయవలెను.
ఈ యాత్ర కాశీ కృత పాపములకు ప్రాయశ్చిత్తము.