Tuesday, February 5, 2013

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దాచిన నిజం

స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా దాచిన నిజం
స్టేట్ బ్యాంకు కు భారత దేశంలో చాలా శాఖలు ఉన్నాయి. అలాగే చాలా మంది ప్రభుత్యోద్యోగులకు స్టేట్ బ్యాంకులో ఖాతాలు ఉన్నాయి. ఖాతాలు ఉన్నవారు చాలామంది స్టేట్ బ్యాంకు వారి ఏ.టి.యమ్. కార్డును కలిగి ఉన్నారు. కార్డు ఉన్నప్పుడు లావాదేవీలు జరపడం కూడా సహజమే కదా. కార్డును మనం రైల్వే టికట్లు కొనడానికి, డిపార్టు మెంటల్ స్టోర్సు లోను, అంతర్జాలం లో లావాదేవీలు జరిపినపుడు వాడుతున్నాము. ఇలా వాడినప్పుడల్లా మన కార్డు ఖాతాకు కొన్ని రివార్డు పాయింట్లు కలస్తూ ఉంటాయి. అలాగే ఈ రివార్డు పాయింట్లను మనం స్టేట్ బ్యాకు వారు ఇచ్చే బహుమతులకు కాని, సెల్ ఫోన్ ఛార్జింగుకు లేక కేబుల్ టివి (డిష్) ఛార్జ చేసుకోవడానికి వాడవచ్చు.
దీనిని వాడుకోవడం చాలా సులభం. ఈ క్రింద ఇస్తున్న లింకుపై క్లిక్ చేసి మీ కార్డును, పాస్ వర్డు రిజిస్టర్ చేసుకోండి. తరువాత మీరు మీ రివార్డ్ పాయింట్లు వాడుకోవండి.
కొన్ని నెలల తరువాత (ఎన్ని నెలలో నాకు తెలవ లేదు) మీరు సంపాదించిన రివార్డు పాయింట్లు మురిగి పోతుంటాయి.
ఇంకెందుకు ఆలస్యం. వెంటనే మీ రివార్డుపాయింట్లు వాడుకోండి.

ఈ పోష్టు వల్ల మీకు ఎంతలాభం కలిగిందో నాకు తెలపుతారు కదా - ఎందు కంటే స్టేట్ బ్యాంకు వాడికి ఎంత దెబ్బ తగిలింతో తెలుసుకోవడానికి
వేణుగోపాల్

1 comment: