Thursday, May 19, 2011

గంగా పుషకరాలు - ఆఖరు రోజు అపశృతి?

గంగా పుష్కరాలకు ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన యాత్రికుల బృందం అయోధ్యనుండి అలహాబాదు నుండి వెళుతుండగా ట్యాంకర్ తో ఢీ కొని కొందరు యాత్రీకులు మృతి చెందినట్లు, ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం ఇప్పుడే అందింది.

ఈ యాత్రికులు వారణాశినుండి అయోధ్య ను దర్శించి అక్కడనుండి అలహాబాదు వెళుతుండగా అయోధ్యనుండి 25 కి. మీ. దూరంలో టాంకర్ తో ఢీకొందని సమాచారం.

యాత్రికులు నెల్లూరుకు చెందిన రెడ్డి కుటుంబమునకు చెందిన వారుగా గుర్తించారు. ఇందులో కొందరు శ్రీ రామతారక ఆంధ్రా ఆశ్రమములోను కొందరు చుట్టుప్రక్కల ఇతర ఆశ్రమములలోను బస చేసారని తెలిసింది. మృతి చెందిన వారిలో ఒకరి పేరు కరిష్మా రెడ్డి అని తెలిసింది.

యాత్రీకులలో ఇద్దరు పురుషులు, పది మంది మహిళలు ఉన్నారని తెలిసింది.

2 comments:

  1. నా కామెంట్ చూసిన తర్వాత డిలీట్ చేయగలరు.

    ReplyDelete