Tuesday, February 15, 2011

ఉపనిషద్ విజ్ఞానము - 3వ భాగము

ఈ అష్టోత్తరశత ఉపనిషత్తులు మానవ సముదాయమును ఉద్ధరించుటకు మహర్షులచే నొసంగబడినవి. వీనిలో బహుళ ప్రచారములగు దశోపనిషత్తులు చాతుర్వర్ణములవారికిని, చతురాశ్రమములవారికిని ప్రయోజనకరములు కాగా మహాత్ములు, పండితులు, ప్రవచన కర్తలు వీనిని మాత్రమే ఉపన్యసించుచుండిరి. ప్రత్యేక ప్రయోజనమాశించువారలు, సూక్ష్మములో మోక్షము నాశించువారలు కనీసము తెలిసికొను ఆవశ్యకము గలదు.

వేదాంతవిద్యను బోధించు ఉపనిషత్తులు 24. యోగవిద్యను బోధించునవి 17. వైష్ణవములు 14. శైవములు 15. శాక్త్యములు 8. సన్యాస సాధకములు 17. సిద్ధాన్త సాధనములు 13. ఇవి బ్రహ్మవీద్యా బోధకములు. ఈ 108 ఉపనిషత్తులలో 11 ఋగ్వేదమునుండియు, 19 శుక్ల యజుర్వేదము నుండియు, 31 కృష్ణ యజుర్వేదమునుండియు, 16 సామవేదము నుండియు, 31 అధర్వణ వేదము నుండియు గ్రహింపబడినవి.

ఈ ఉపనిషత్తుల మూలమగు చతుర్వేదముల ద్వారా గ్రహింపబడిన నాల్గు మహావాక్యములు, సర్వసంగపరిత్యాగులై దండకమండల స్వీకారముతో సన్యాసాశ్రమ స్వీకారులకు బ్రహ్మోపదేశముగా ననుగ్రహింపబడును.

1. ప్రజ్ఞానం బ్రహ్మ లక్షణ వాక్యము

2. తత్త్వమసి ఉపదేశ వాక్యము

3. అహం బ్రహ్మాస్మి స్వానుభవవాక్యము

4. ఆయమాత్మాబ్రహ్మ సాక్షాత్కార వాక్యము

వీనితోజేరి ఆత్మాను సంధానమునకు ప్రయత్నించు సర్వులకొరకుగాను మహావాక్య నక్షత్రమాలననుగ్రహించిరి.

మహావాక్యము

ఉపనిషత్తు

1.

ఈశావాస్యమిదం సర్వం

ఈశావాస్యోపనిషత్

2.

మనస్తత్రలయంయాతి తద్విష్ణోః పరమం పదం

నాదబిందూపనిషత్

3.

ఆత్మావా ఇదమేక ఏవాగ్ర ఆసీత్

ఐతరేయోపనిషత్

4.

సర్వంఖల్విదంబ్రహ్మ

ఛాందోగ్యోపనిషత్

5.

ఏకోదేవస్సర్వభూతేషుగూఢః

కైవల్యోపనిషత్

6.

మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః

అమృతబిందూపనిషత్

7.

మిత్యేకాక్షరం బ్రహ్మ ఓమిత్యేతేనరేచయేత్

అమృతనాదోపనిషత్

8.

చిత్తఏవహి సంసారం

మైత్రేయణ్యుపనిషత్

9.

యస్మిన్సర్విమిదం ప్రోతం బ్రహ్మస్థావర జంగమం

మంత్రికోపనిషత్

10.

బ్రహ్మైవాహం సర్వవేదాన్త వేద్యం

సర్వసారోపనిషత్

11.

ప్రజ్ఞానం బ్రహ్మ

ఐతరేయోపనిషత్

12.

తత్వమసి

ఛాందోగ్యోపనిషత్

13.

అహం బ్రహ్మాస్మి

బృహదారణ్యకోపనిషత్

14.

ఆయమాత్మాబ్రహ్మ

మాండూక్యోపనిషత్

15

ఏకమేవాద్వితీయం సన్నామరూప వివర్జితం

శుకరహస్యోపనిషత్

16

ఓమి త్యేకాక్షరం బ్రహ్మ ధ్యేయం సర్వ ముముక్షుభిః

ధ్యానబిందూపనిషత్

17

సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్యతే

త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్

18

యావత్‌దృష్ఠిః భృవోర్మధ్యే తావత్కాలం భయం కుతః

యోగచూడామణ్యుపనిషత్

19.

బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా

శరభోపనిషత్

20.

ఏకమేవాద్వితీయం బ్రహ్మ

పైంగలోపనిషత్

21.

అహం సచ్చిత్పరానంద బ్రహ్మైవాస్మి

మహోపనిషత్

22.

సఏష సర్వభూతాన్తరాత్మా

అధ్యోత్మోపనిషత్

23

త్యాగేనైకే అమృతత్వమానసుః

అవధూతోపనిషత్

24.

బ్రహ్మవిదాప్నోతిపరం

భస్మజాబోలోపనిషత్

25.

హరేరామ హరేరామ రామరామ హరేహరే

హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరేహరే

కలిసంతారణోపనిషత్

26.

అస్తిభాతి ప్రియం రూపం

నామచేత్సంశ పంచకం

సరస్వతీ రహస్యోపనిషత్

27.

అశబ్ద మస్పర్శ మరూపమవ్యయం

తథారసం నిత్యమగంధవచ్చయత్

ముక్తికోపనిషత్

1 comment:

  1. చాలా చక్కటి సమాచారాన్ని ఇచ్చారు. ధన్యవాదములు.

    ReplyDelete