Monday, November 25, 2013

కాశీ కుసుమ కదంబమ్ (కాశీ లోని దేవతల ప్రార్థనలు)


కొన్ని సంవత్సరాల క్రితం మా మిత్రులు శ్రీ సుందర శాస్త్రి గారు - కాశీ కుసుమ కదంబమ్ - అనే పేరిట ఒక పుస్తకాన్ని ముంద్రింపించేరు. దీనిలో కాశీ మరియు కాశీలో ఉన్న దేవతల స్తోత్రములు ఉన్నందున దీనికి చాలా ప్రాచుర్యం లభించింది. ప్రధమముద్రణ లోని పుస్తకాల ప్రతులు అయిపోవడం తో మా మిత్రులు ఈ పుస్తకాన్ని పునర్ముద్రించాలనే కోరికతో నా సహాయం కోరారు. ఇదివరకు ఈ పుస్తకాన్ని సి-డాక్ వారి ఐ-లీప్ ఉపయోగించి ప్రచురించాము. అందువల్ల దీనిని తిరిగి యూనీకోడీకరించవలసి వచ్చింది.

క్రింద ఉన్న శ్లోకాలలో తప్పులు ఉండవచ్చు. ఎందుకంటే దీన్ని ఇంకా ఎవరూ ప్రూఫ్ రీడ్ చేయలేదు. బ్లాగ్ వీక్షకులను ఇందులోని తప్పులు చూపించవలసినదిగా కోరుతున్నాము.

ఇందులో ధూర్జటి మరియు గిడుగు ఖతులను వాడడం జరిగింది - వీటిని తెలుగు విజయం వెబ్ సైటునుండి దిగుమతి చేసుకోవచ్చు.


శ్లో॥
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్॥





1. కాశీ ప్రార్థన

శ్లో॥
జయకాశి ! మహావిద్యే పతితానాం చ పావని!
త్వా మృతే గతి రన్యా న సంసారే మజ్జతా మిహ!

శ్లో॥
భూయిష్ఠా ऽపి న యాత్ర భూః త్రిదివతో ప్యుచ్చై రధస్థాపి యా
యా బద్ధా భువి ముక్తిదా స్యు రమృతం యస్యాం మృతా జంతవః
యా నిత్యం త్రిజగత్పవిత్రతటినీతీరే సురై స్సేవ్యతే
సా కాశీ త్రిపురారి రాజనగరీ పాయా దపాయా జ్జగత్!





2. కాశీ స్మరణమ్

శ్లో॥
విశ్వేశో జనకో హ్యుమా చ జననీ గంగా చ మాతృష్యసా
ఢుంఢీ భైరవ దండపాణి సదృశా జ్యేష్ఠా మమ భ్రాతరః
శ్రీ కాశీ మణికర్ణికా చ భగనినీ భార్యా మమేయం మతిః
సత్కర్మాణి సుతా స్త ఏవ సుహృదః కాశ్యాం కుటుంబం మమ!

శ్లో॥
కాశీ కాశీతి కాశీతి త్రివారం యః పఠే న్నరః
సో ऽపి దేశాంతరే వాసీ కాశీవాసఫలం లభేత్!

శ్లో॥
అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసా మ్యహమ్
ఇతి బ్రువాణ స్సతతం కాశీవాస ఫలం లభేత్!







3. కాశీ పంచకమ్


(జగద్గురు శంకరాచార్య విరచితం)

శ్లో॥
మనో నివృత్తిః పరమోపి శాంతిః సాతీర్థ వర్యా మణికర్ణికా ऽత్ర
జ్ఞానప్రవాహో విమలాది గంగా సా కాశికాఽహం నిజబోధ రూపా!
(1)
శ్లో॥
యస్యా మదం కల్పిత మింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసమ్
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాఽహం నిజబోధరూపా!
(2)
శ్లో॥
కోశేషు పంచ స్వభిరాజమానా బుద్ధి ర్భవానీ ప్రతిదేహగేహమ్
సాక్షీ శివ స్సర్వగతోం తరాత్మా సా కాశికాహం నిజబోధరూపా!
(3)
శ్లో॥
కాశ్యాం తు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా!
(4)
శ్లో॥
కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోన్తరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పున స్తీర్థ మన్య త్కిమస్తి॥


పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కనిపించినది. ముముక్షువునకు బహిర్భూతము (వెలుపల) గా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రధాన స్థానము కనిపించుచున్నది. జ్ఞాన ప్రకాశమే కాశీ క్షేత్రము.



No comments:

Post a Comment