అయ్యలారా , అమ్మలారా
గత కొద్ది రోజులుగా నేను పోస్ట్ చేస్తున్న కాశీ కేదారం అనబడు కేదార ఖండ మహాత్మ్యం ఒక కొలిక్కి వచ్చింది. మధ్య మధ్య ఒకటి రెండు అధ్యాయాలు పొస్ట్ చెయ్యలేదు కూడా? దీనిని త్వరలో ప్రింటు వెయ్యబోతున్నాము. ఎవరికైనా దీనిని చదివి అందులోని పుచ్చు తప్పులు ... అచ్చు తప్పులు ... భాషాదోషాలు మాకు తెలియచేయాలని ఉంటే మాకు ఒక వేగు పంపిన వారికి పూర్తి బ్లాగు యెక్క పి.డి.యఫ్ ప్రతి పంపగలము.
అట్లే కాశీ గురించి ఏమయినా సమాచారం తెలుసు కోవాలన్న జిజ్ఞాస ఉన్న మా బ్లాగులో కామెంటినా సరే లేక వేగుపంపినా ఆ సమాచారాన్ని మా బ్లాగులో పొందు పరుస్తాం. అట్లే ఇక ముందు మా బ్లాగులో ఆధ్యాత్మిక విషయాలు పోస్ట్ చేస్తాం. ఇలాగే ఆదరిస్తారని తలుస్తున్నాం.
మరొక విషయం నాబ్లాగులో ఇంతవరకు వచ్చిన కామెంట్లు 2. ఇన్ని తక్కువ కామెంట్లు ఇంతవరకూ ఏ బ్లాగుకు రాలేదని, మాదే రికార్డని మేము భావిస్తున్నాం.
జయ్ హో
This comment has been removed by the author.
ReplyDeleteనేను మీ బ్లాగ్ చదవలేదు కానీ కామెంట్లు రాలేదని బ్లాగ్ మూసెయ్యడం విచిత్రంగా ఉంది.
ReplyDeleteవచ్చిన కామెంట్లు కూడా కావాలని డిలీట్ చేసే బ్లాగర్ ఒకరు ఉన్నారు. అతని బ్లాగ్ కి కూడా రోజుకి రెండు వందలు హిట్లు వస్తుంటాయి. మురుగేశన్ గతంలో నా కామెంట్లు కూడా డిలీట్ చేశాడు. కామెంట్లు తక్కువగా ఉన్నా జనం బ్లాగ్ ని చూస్తారని అతనికి తెలుసు.
plz do not delete the blog.
ReplyDeleteI prefer comedy and then spiritual. That is the reason I do not visit your blog frequently. But this is the blog I liked the moment I have seen it.
బ్లాగును మూసేస్తానని నేననలేదే. నా పోస్ట్ సరిగ్గా చదవండి.
ReplyDeleteనమస్కారం నేను ఇప్పుడే మీ బ్లగును చూసాను ఎన్నొ కొత్త విషయాలు తెలుసుకోవచ్చు మీ నుంచి కానీ ఒక్క చిన్న విన్నపం మీరు ప్రయోగించే బాష కొంచం కష్టంగా వుంది అర్దం చేసుకోవటానికి...శ్రీ
ReplyDeleteమీ పీడీయప్ పుస్తకం ఉచిత పంపిణీ కోసం అయితే ఒక కాపీ పంపితే తెలుగురత్న గ్రంధాలయంలో ఈ బుక్స్ విభాగంలో ఉచిత డౌన్ లోడ్ కొసం పెట్టగలము. webmaster@teluguratna.com
ReplyDeleteIm ready to proof read your book. if you are interested, you can contact me at chkrman@gmail.com
ReplyDeleteఅరే మీకు బ్లాగున్న సంగతే నాకు తెలియదే? ఎప్పుడూ చెప్పలేదు కూడా! ముందు చదవనివ్వండి. తరవాత ఎన్నుఇ కామెంట్లు కావాలంటే అన్ని పెడతా :))
ReplyDeleteగురువు గారూ,
ReplyDeleteభాష వ్యవహారికంలో ఉంటే బాగుండేది. చదివి అర్ధం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది.
నేనొక యాభై పేజీలు ప్రూఫ్ చేశాను. పూర్తిచేసి త్వరగా పంపడానికి ప్రయత్నిస్తాను
ReplyDeleteMeeru achha telugu or grandhikam lo tapa antha rasaaru.Kani"blog"ane padaanni matram english lo rasaru.daniki edo oka telugu padamu alochinchandi mari.
ReplyDeletee-mail=vegu
ReplyDeletesoftware=mrudulantram
internet=antarjalam
blog=?
మిత్రమా!
ReplyDeleteమీ పుస్తకం పి.డిఎఫ్. ప్రతి పంపిస్తే మేము మా [url="http://teluguthesis.com"]‘తెలుగుపరిశోధన’[/url]లో ప్రకటిస్తాము. అలాగే సభ్యులనుండి సలహాలు, సూచనలూ కోరదాము. మీకు అభ్యంతరం లేకుంటే..admin@teluguthesis.com కి పంపించండి.
అంతకంటే మరొక మహత్తర కార్యం......మీరే స్వయంగా దాన్ని మా[url="http://teluguthesis.com"]‘తెలుగుపరిశోధన’[/url] forum లో ప్రకటించడం. అప్పుడు మేమూ చంకలుగుద్దుకుంటాం " మా ఫోరం లో మేమే కాకుండా మా సభ్య మిత్రులు కూడా పుస్తకాలను మా వద్ద ప్రకటిస్తున్నార" ని.
శ్రీయుతులు దువ్వూరి వేణుగోపాల్ గారికి,
ReplyDeleteనమస్సులు.
"కాశికేదారం" PDF file క్రింద యివ్వ బడిన నా ఈ-మెయిల్ కు పంప గలరని మనవి.
k_narasimhamurthy@yahoo.co.in
knarasimhamuerhybhu@gmail.com
తర్వాత కాశిలో గంగాస్నానము చేయునపుడు చెప్పుకోవలసిన సంకల్పము కూడ వీలైతే ప్రచురించగలరు.
డా. క. హ. హ. వె. సూ.సు. నరసింహమూర్తి.
కా. హి. వి. వి.
వారాణసి