విశ్వనాథుని
అంతర్గృహ ప్రదక్షిణ యాత్ర
శ్లో॥ పూర్వతో
మణికర్ణేశో బ్రహ్మేశో దక్షిణే
స్థితః
పశ్చిమే
చైవ గోకర్ణో భారభూతస్తధోత్తరే
॥
తూర్పున
మణికర్ణికేశ్వరుడు,
దక్షిణమున
బ్రహ్మేశ్వరుడు,
పడమట
గోకర్ణేశ్వరుడు,
ఉత్తరమున
భారభూతేశ్వరుడు అవధిగా గలది
అంతర్గృహము.
కాశీ
వాసులు ప్రతిరోజు అంతర్గృహయాత్రను
చేయవలెను.
ఆ విధముగా
చేయలేని వారు ప్రతి సంవత్సరము
పంచక్రోశీయాత్రకు ముందుగా
అవశ్యము చేయవలెను.
ప్రాతఃకాల
స్నానమాచరించి కాశీ విశ్వనాథ
మందిరమునకు రావాలి.
విశ్వనాథ,
అన్నపూర్ణాదేవి,
ఢుంఢి
గణపతి,
దండపాణి,
మోద ప్రమోద
దుర్ముఖ సుముఖ గణనాథ పంచవినాయకులను
పూజించి విశ్వనాథుని దర్శించి,
జ్ఞానవాపీ
జలమును మార్జనచేసికొని
వ్యాసపీఠము దగ్గర కూర్చుండి,
తీర్థపురోహితునిచే
అంతర్గృహయాత్రా సంకల్పమును
చెప్పించికొని
అంతర్గృహస్య
యాత్రాం వై కరిష్యేఽఘౌఘశాంతయే
ప్రీత్యర్థం
తవ దేవదేవేశ విశ్వనాథ కృపానిధే
॥
అను మంత్రమును
చదివి యాత్రను ప్రారంభించవలెను.హరహర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకే సంగే
అని
ఉచ్చరించుచూ యాత్రను చేయవలెను.
యాత్రాంతమునందు
కాశీ విశ్వనాథుని,
అన్నపూర్ణామాతను
దర్శించి,
పూజించి,
జ్ఞానవాపి
దగ్గర ఉత్తర సంకల్పముతో
యాత్రను ముగించవలెను.
1. |
శ్రీ పంచవినాయకేభ్యో
నమః |
విశ్వనాథ సభ |
2. |
శ్రీ విశ్వనాథాయ
నమః |
ప్రసిద్ధము |
3. |
శ్రీ జ్ఞానవాపీ
తీర్థాయ నమః |
విశ్వనాథ
మందిరము వెనుక |
4. |
శ్రీ మణికర్ణికా
తీర్థాయ నమః |
మణికర్ణికా
ఘాట్ |
5. |
శ్రీ మణికర్ణికేశ్వరాయ
నమః |
సీ.కే.
8/12 అభయానంద
మఠ్ గడ్ వాసీ టోలా |
6. |
శ్రీ కమలేశ్వరాయ
నమః |
సీ.కే.
8/14 గడ్‌వాసీ
టోలా |
7. |
శ్రీ కంబలాశ్వతరాభ్యాం
నమః |
సీ.కె.
8/14 గోమఠ్‌కాకారామ్
గల్లీ |
8. |
శ్రీ వాసుకీశ్వరాయ
నమః |
సీ.కె.
7/155 సింధియా
ఘాట్ |
9. |
శ్రీ పర్వతేశ్వరాయనమః |
సీ.కే.
7/156 |
10. |
శ్రీ గంగాకేశవాయ
నమః |
డీ.
1/66 లలితా
ఘాట్‌పై |
11. |
శ్రీ లలితా
దైవ్యై నమః |
డీ.
1/67 లలితా
ఘాట్‌పై |
12. |
శ్రీ జరాసంధేశ్వరాయ
నమః |
డీ.
5/100 త్రిపురభైరవ
ఘాట్ పై |
|
ప్రాచీనము
లుప్తము.
ప్రస్తుతము
ఆశా వినాయక మందిరము నందు |
|
13. |
శ్రీ సోమనాథేశ్వరాయ
నమః |
డీ.
16/34 మానమందిరఘాట్ |
14. |
శ్రీ అదాలభేశ్వరాయ
నమః |
మానమందిర ఘాట్ |
15. |
శ్రీ శూలటంకేశ్వరాయనమః |
దశాశ్వమేథఘాట్ |
16. |
శ్రీ వారాహేశ్వరాయ
నమః |
డీ.
17/111 ప్రయాగ
ఘాట్ |
17. |
శ్రీ బ్రహ్మేశ్వరాయ
నమః |
డీ.
33/67 ఖాలిస్‌పురా |
18. |
శ్రీ అగస్తీశ్వరాయ
నమః |
డీ.
36/11 అగస్త్యకుండ్ |
19. |
శ్రీ కశ్యపేశ్వరాయ
నమః |
డీ.
35/12 జంగమవాడీ
మఠ్ దగ్గర |
20. |
శ్రీ హరికేశేశ్వరాయ
నమః |
డీ.
35/12 జంగమవాజడీ
మఠ్‌కు ఎదురు సందులో ఖారీకూపం |
21. |
శ్రీ వైద్యనాథేశ్వరాయ
నమః |
డీ.
50/20 కోదఈ
చౌకీ,
కాజీపురా |
22. |
శ్రీ గోకర్ణేశ్వరాయ
నమః |
డీ.
50/20 కోదఈ
చౌకీ |
23. |
శ్రీ ధ్రువేశ్వరాయ
నమః |
డీ.
46/10 నఈసడక్
, సనాతన
ధర్మ కాలేజి |
24. |
శ్రీ హాటకేశ్వరాయ
నమః |
సీ.కే.
48/260 హాడ్‌హా
సరాయ్ |
25. |
శ్రీ అస్థిక్షేప
తటాకేశ్వరాయ నమః |
సీ.కే.
48/44 రాజా
దర్వాజా |
26. |
శ్రీ కీకసేశ్వరాయనమః |
సీ.కే.
48/44 రాజా
దర్వాజా |
27. |
శ్రీ భారభూతేశ్వరాయ
నమః |
సీ.కే.
54/4 మచ్ఛరహట్టా
ఫాటక్,
రాజాదర్వాజా |
28. |
శ్రీ
చిత్రగుప్తేశ్వరాయ నమః |
సీ.కే.
47/66 రేశమ్
కటరా |
29. |
శ్రీ చిత్రఘంటాదుర్గా
దేవ్యైనమః |
సీ.కే.
33/34 చందు
నాఊ గల్లీ,
చౌక్‌కు
వెనుక |
30. |
శ్రీ పశుపతీశ్వరాయ
నమః |
సీ.కె.
13/66 పశుపతీశ్వర
గల్లీ |
31. |
శ్రీ పితామహేశ్వరాయ
నమః |
సీ.కే.
73/1సిద్ధేశ్వరీ,
శీతలా
గల్లీ |
32. |
శ్రీ కలశేశ్వరాయ
నమః |
సీ.కే.
7/10 సిద్ధేశ్వరీ |
33. |
శ్రీ చంద్రేశ్వరాయ
నమః |
సీ.కే.
7/124 సిద్ధేశ్వరీ |
34. |
శ్రీ ఆత్మావీరేశ్వరాయ
నమః |
సీ.కే.
7/158 సింధియా
ఘాట్ |
35. |
శ్రీ విద్యేశ్వరాయ
నమః |
సీ.కె.
2/49 సిద్ధేశ్వరీ |
36. |
శ్రీ అగ్నీశ్వరాయ
నమః |
సీ.కె.
2/1 పటనీ
టోలా |
37. |
శ్రీ నాగేశ్వరాయ
నమః |
సీ.కె.
1/21 పటనీ
టోలా |
38. |
శ్రీ
హరిశ్చంద్రేశ్వరాయ నమః |
సీ.కె.
7/166 సంకటాజీ
ఘాట్ |
39. |
శ్రీ చింతామణి
వినాయకాయ నమః |
సీ.కె.
7/161 వశిష్ఠేశ్వరుని
ద్వారము దగ్గర |
40. |
శ్రీ సేనా
వినాయకాయ నమః |
అక్కడే సంకటాజీ
పరిక్రమ మార్గము పై |
41. |
శ్రీ వశిష్ఠ
వామదేవాభ్యాం నమః |
సీ.కే.
7/161సంకటాజీ
మార్గం లో |
42. |
శ్రీ కరుణేశ్వరాయ
నమః |
సీ.కె.
34/10 లాహిరీ
టోలా -
లలితా
ఘాట్ మార్గములో |
43. |
శ్రీ త్రిసంధ్యేశ్వరాయ
నమః |
సీ.కే.
34/10లాహిరీ
టోలా |
44. |
శ్రీ విశాలాక్షీ
గౌర్యై నమః |
మీర్ ఘాట్ |
45. |
శ్రీ ధర్మేశ్వరాయ
నమః |
డీ.
2/13 ధర్మకూప్,
మీర్ ఘాట్ |
46. |
శ్రీ విశ్వభుజా
గౌరీ దేవ్యై నమః |
డీ.
2/13ధర్మకూప్,
మీర్ ఘాట్ |
47. |
శ్రీ ఆశా
వినాయకాయ నమః |
డీ.
3/79 మీర్
ఘాట్ |
48. |
శ్రీ వృద్ధాదిత్యాయ
నమః |
డీ.
3/16 మీర్
ఘాట్ |
49. |
శ్రీ
చతుర్వక్త్రేశ్వరాయ నమః |
డీ.
7/16 శకర్‌కంద్
గల్లీ |
50. |
శ్రీ బ్రాహ్మీశ్వరాయ
నమః |
డీ.
7/6, శకర్‌కంద్
గల్లీ |
51. |
శ్రీ మనః
ప్రకామేశ్వరాయ నమః |
డీ.
10/50 సాక్షి
వినాయకునకు ఎదురుగా |
52. |
శ్రీ ఈశానేశ్వరాయ
నమః |
భాంస్ ఫాటక్ |
53. |
శ్రీ
చండీచండీశ్వరాయనమః |
డీ.
8/26 కాళికా
గల్లీ |
54. |
శ్రీ భవానీ
శంకరాభ్యాం నమః |
అన్నపూర్ణ
మందిరములోని రామమందిరములో
జగన్నాథుని ప్రక్కన |
55. |
శ్రీ ఢుంఢిరాజాయనమః |
ప్రసిద్ధము
సావిత్రీ పాటక్ |
56. |
శ్రీ రాజరాజేశ్వరాయ
నమః |
సీ.కె.
35/33 ఢుంఢి
రాజు గల్లీ |
57. |
శ్రీ లాంగలీశ్వరాయ
నమః |
సీ.కే.
20/41 ఖోవా
బజార్ |
58. |
శ్రీ నకులీశ్వరాయ
నమః |
(1) అక్షయవటము
దగ్గర (2) ఢుంఢిరాజు తరువాత మేడపైన పంచముఖ వినాయకుని దగ్గర |
59. |
శ్రీ పరాన్నేశ్వరాయ
నమః |
ఢుంఢిరాజు
గల్లీ -
దండపాణికి
ఎదురుగా ఇంట్లో |
60. |
శ్రీ పరద్రవ్యేశ్వరాయ
నమః |
”
|
61. |
శ్రీ ప్రతిగ్రహేశ్వరాయ
నమః |
”
|
62. |
శ్రీ నిష్కలంకేశ్వరాయ
నమః |
సీ.కే.
35/34, దండపాణికి
ఎదురుగా ఇంట్లో |
63. |
శ్రీ మార్కండేశ్వరాయ
నమః |
ఢుంఢిరాజు
గల్లీ,
దండపాణి
ప్రక్కన |
64. |
శ్రీ అప్సరేశ్వరాయ
నమః |
జ్ఞానవాపి 4
వ గేటు
నుండి వెళ్ళునప్పుడు రాధాకృష్ణ
ధర్మశాలలో |
65. |
శ్రీ గంగేశ్వరాయ
నమః |
మసీదుకు తూర్పున
రావి చెట్టు క్రింద |
66. |
శ్రీ జ్ఞాన
వాప్యై నమః |
జ్ఞానవాపి
జలముతో స్నానముగాని మార్జనగాని
చేసి కొని జ్ఞానవాపిని
పూజించవలెను. |
అనంతరము
నందికేశ్వరుని,
తారకేశ్వరుని,
మహాకాళేశ్వరుని,
దండపాణిని,
మహేశ్వరుని,
మోక్షేశ్వరుని,
వీరభద్రేశ్వరుని,
అవిముక్తేశ్వరుని,
పంచ వినాయకులను,
కాశీ
విశ్వనాథుని దర్శించి
పూజించవలెను.
వ్యాసపీఠము
దగ్గర కూర్చుండి ఆచార్యుని
ద్వారా సంపూర్ణయాత్రా దేవతల
నామములను చెప్పించుకొని
అక్షతలు జలము విడువవలెను.
శ్లో॥ అంతర్గృహస్య
యాత్రేయం యథావద్యా మయా కృతా
న్యూనాతిరిక్తయా
శంభుః ప్రీయతామనయా విభుః ॥
అని
శివుని ప్రార్థించి,
శక్త్యనుసారముగా
అచార్యునకు దక్షిణ భోజనముల
నొసంగవలెను.
No comments:
Post a Comment