Tuesday, October 10, 2017

కాశీ పంచక్రోశి యాత్ర - మహాత్మ్యము - సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారి ఆశీర్వాద శ్రీముఖము



ఆశీర్వాద శ్రీముఖము
కాశీ పరిక్రమ విధానమును గురించి బ్రహ్మశ్రీ మల్లాది శ్రీహరి శాస్త్రిగారు సమగ్ర సుందరమైన గ్రంథమును రచించారు. ఈ అంశాన్ని వివరిస్తూ లోగడ కొన్ని రచనలు వచ్చినవి. కాని వీరి రచన అన్ని విశేషాలతో సర్వాంగీణంగా, సులభంగా, సుబోధకంగా ఉంది. ఉత్తర భారతంలో పరిక్రమ అనే పదాన్ని దక్షిణ భారతంలో ప్రదక్షిణం అంటారు.
తెలుగువారి కోసం తెలుగులో వ్రాసినది గనుక ప్రదక్షిణ యాత్ర అనే పదాన్నే శాస్త్రిగారు ఉపయోగించారు. గడచిన కొన్ని దశాబ్దాలుగా మల్లాది వారు బాగా తెలిసిన వారు. హిందూ ధర్మం కోసం జీవితం అంకితం చేసిన వ్యక్తి. సమర్థులైన పౌరాణికులు. బహు గ్రంథరచయిత. ఇప్పుడు వ్రాసిన గంథంవంటి ప్రజోపయోగకర గ్రంథాలు మరిన్ని వీరి లేఖిని నుండి రావాలని ఆశీర్వదిస్తున్నాను.
ఈ గ్రంథానికి ప్రేరకులు, కారకులు వారాణాసి లోని సుప్రసిద్ధ శ్రీరామ తారక ఆంధ్రాశ్రమం మేనేజింగ్ ట్రస్టీ శ్రీ వేమూరి వేంకట సుందర శాస్త్రి గారు. ఆంధ్ర యాత్రికులకు అనుపమానమైన పార సేవ చేస్తున్న సహృదయులు. సంస్కార సంపన్నులు. కాశీ విశ్వనాథుడు, విశాలాక్షీ వల్లభుడు వీరికి, వీరికుటుంబానికి శుభములు ప్రసాదించును గాక!
నారాయణ స్మరణతో
07.08.3027 -శ్రావణ పూర్ణిమ
వారణాసి                                                                                                                                                 సిద్ధేశ్వరానందభారతీస్వామి

No comments:

Post a Comment