నిత్యయాత్ర
(కాశీ
ఖండము 100
వ అధ్యాయము)
యాత్రికులు
ప్రథమముగా మణికర్ణికయందు
స్నానమును చేయవలెను.
పిమ్మట
దేవర్షి పితృతర్పణములను చేసి
బ్రాహ్మణులను యాచకులను
సంతృప్తి పరచవలెను.
1. |
ద్రౌపదాదిత్య |
విశ్వనాథుని
సందులో హనుమాన్ మందిర సమీపమందలి
అక్షయవటము దగ్గర |
2. |
ద్రౌపది |
అక్కడే |
3. |
విష్ణువు |
విశ్వనాథుని
మందిరపు ఆవరణలో |
4. |
దండపాణి |
ఢుంఢిరాజు
వీధిలోని పంచక్రోశీదండపాణి |
5. |
మహేశ్వరుడు |
జ్ఞానవాపికి
పశ్చిమ దక్షిణ కోణమందు రావి
చెట్టు క్రింద |
6. |
ఢుంఢి గణపతి |
ప్రసిద్ధమగు
అన్నపూర్ణా మందిర మార్గమున
మొదట – సావిత్రీ ఫాటక్ |
7. |
జ్ఞానవాపి |
ప్రసిద్ధము
- జ్ఞానవాపీజలమును
త్రాగి ఆచమించవలెను |
8. |
నందికేశ్వరుడు |
జ్ఞానవాపికి
తూర్పున పెద్దనంది (నందికేశ్వరుడు
లుప్తము) |
9. |
తారకేశ్వరుడు |
జ్ఞానవాపికి
తూర్పునగల పెద్ద నందికి
తూర్పున గౌరీశంకరులకు క్రింద
రావి చెట్టు క్రింద |
10. |
మహాకాళేశ్వరుడు |
జ్ఞానవాపి
దగ్గర వ్యాసపీఠమున కెదురుగాగల
రావిచెట్టు క్రింద |
11. |
దండపాణి |
ఢుంఢిరాజు
వీధిలో |
12. |
శ్రీకాశీవిశ్వేశ్వరుడు |
ప్రసిద్ధము |
శ్లో॥ దైనందినీ
విధాతవ్యా మహాఫల మభీప్సుభిః
తతో
వైశ్వేశ్వరీయాత్రా కార్యా
సర్వార్థ సిద్ధిదా ॥
మహాఫలమును
కోరు కాశీ వాసులు సర్వార్ధములను
సిద్ధింపజేయునట్టి యీ నిత్య
యాత్రను అవశ్యము చేయవలెను.
No comments:
Post a Comment