5రాత్రుల
పంచక్రోశీ యాత్ర
1వ
రోజు యాత్ర
యాత్రకు
బయలుదేరు రోజునందు సూర్యోదయముకంటె
ముందుగా ప్రాతఃకాలమునందు
గంగా స్నానమును చేయవలెను.
తరువాత
విశ్వేశ్వరునకు మూడు సార్లు
ప్రదక్షిణలు చేసి,
సాష్టాంగ
దండప్రణామములను చేయవలెను.
యథా శక్తిగ
పూజించవలెను.
అనంతరము
ముక్తి మండపమందున్న – అనగా
విశ్వనాథుని సభయందలి -
మోద,
ప్రమోద,
సుముఖ,
దుర్ముఖ
అను పేర్లు గల నల్గురు వినాయకులను
జ్ఞానవాపి యొద్దగల గణనాథ
వినాయకుని (మొత్తము
అయిదుగురు వినాయకులు),
దండ పాణిని
(శ్రీ
విశ్వేశ్వరునకు ఎదురుగానున్న
మందిరమునందు),
కాల భైరవుని
(విశ్వేశ్వరుని
మందిరపు దక్షిణ ద్వారమునకు
ఎదురుగా)
ఆ తరువాత
అన్నపూర్ణా మాతను దర్శించి
పూజించవలెను.
పిమ్మట
జ్ఞానవాపి మండపమందలి వ్యాసపీఠము
వద్ద సంకల్పము చెప్పించుకొని,
అచ్చటి
బ్రాహ్మణునకు దక్షిణ,
భోజనమునకు
స్వయంపాకమును సమర్పించి
క్రింది ప్రతిజ్ఞా మంత్రములను
పఠింపవలెను.
శ్లో
॥ పంచ
క్రోశస్య యాత్రాం వై కరిష్యే
విధి పూర్వకమ్
ప్రీత్యర్థం
తవ దేవేశ సర్వాఘౌఘ ప్రశాంతయే
॥
శ్లో॥ కాశ్యాం
ప్రజాత వాక్కాయ మనోజనితముక్తయే
జ్ఞాతాఽజ్ఞాత
విముక్త్యర్థం పాతకేభ్యో
హితాయచ ॥
శ్లో॥ పంచక్రోశాత్మకం
లింగం జ్యోతీరూపం సనాతనమ్
భవానీ
శంకరాభ్యాం చ లక్ష్మీశ్రీశ
విరాజితమ్ ॥
శ్లో॥ ఢుంఢి
రాజాది గణపైః షట్పంచాశద్భిరావృతమ్
ద్వాదశాదిత్య
సహితం నృసింహైః కేశవైర్యుతమ్
॥
శ్లో॥ కృష్ణ
రామత్రయ యుతం కూర్మ మత్స్యాదిభిస్తథా
అవతారై
రనేకైశ్చ యుతం విష్ణోః శివస్యచ
॥
శ్లో॥ గౌర్యాది
శక్తిభిర్జుష్టం క్షేత్రం
కుర్యా త్ప్రదక్షిణమ్
బద్ధ్వాంజలిం
ప్రార్థయీత మహాదేవం మహేశ్వరమ్
॥
అని సంకల్పమును
చెప్పించుకొనవలెను.
పిమ్మట
అక్కడి నుండి మౌనముగా మణికర్ణికకు
చేరవలెను.
మణికర్ణికా
ఘాటులో స్నానమును గాని
ప్రోక్షణగాని చేసికొని,
మెట్లపైగల
సిద్ధి వినాయకుని,
ఆ పైన గల
మణికర్ణికేశ్వరుని దర్శించి,
పూజించి
యాత్రను ప్రారంభించవలెను.
పంచక్రోశాత్మకాయ,
మహాలింగాయ,
జ్యోతిర్లింగ
స్వరూపాయ,
కాశీ
విశ్వేశ్వరాయ,
శ్రీ శివాయ
నమః
అను
శ్లోకమును తరువాతి మజిలీ
చేరువరకు మార్గములో చదువుచుండవలెను.
మణికర్ణికనుండి
అస్సీ ఘాట్ వరకు కాలినడకన
గంగాతీరమందలి పంచక్రోశీమార్గ
దేవతలను దర్శించుచూ వెళ్లవలెను.
కాని
ప్రస్తుతము పడవలో వెళ్ళుచూ,
ఆయా దేవతలను
స్మరించి ధవళాక్షతలను
సమర్పించుచూ వెళ్లుట శిష్టాచారముగా
నున్నది.
మణికర్ణికా
ఘాట్ నుండి అస్సీఘాట్ వరకు
1. |
ఓం మణికర్ణికేశ్వరాయ
నమః |
మణికర్ణికా
ఘాట్ |
2. |
ఓం సిద్ధి
వినాయకాయ నమః |
”
|
3. |
ఓం గంగా కేశవాయ
నమః |
లలితా ఘాట్ |
4. |
ఓం లలితా గౌరీ
దేవ్యై నమః |
”
|
5. |
ఓం జరాసంధేశ్వరాయ
నమః |
త్రిపురభైరవీ
ఘాట్ - ఆశా
వినాయకుని మందిరమందు |
6. |
ఓం సోమనాధేశ్వరాయ
నమః |
మానమందిర్
ఘాట్ |
7. |
ఓం దాలభేశ్వరాయ
నమః |
”
|
8. |
ఓం శూల టంకేశ్వరాయ
నమః |
దశాశ్వమేధ
ఘాట్ |
9. |
ఓం వారాహేశ్వరాయ
నమః |
”
|
10. |
ఓం బందీ దైవ్యై
నమః |
”
|
11. |
ఓం దశాశ్వమేధేశ్వరాయ
నమః |
దశాశ్వమేధ
ఘాట్ -
శీతలా
దేవి మందిరమునందు |
12. |
ఓం సర్వేశ్వరాయ
నమః |
పాండేయ్ ఘాట్
పైన |
13. |
ఓం కేదారేశ్వరాయ
నమః |
కేదార్ ఘాట్ |
14. |
ఓం హనుమదీశ్వరాయ
నమః |
హనుమాన్ ఘాట్ |
15. |
ఓం అర్క వినాయకాయ
నమః |
తులసీ ఘాట్
పై |
16. |
ఓం లోలార్క
సూర్యాయ నమః |
లోలార్క
కుండ్,
భదైనీ
|
17. |
ఓం అస్సీ
సంగమేశ్వరాయ నమః |
అస్సీ ఘాట్ |
అస్సీ
ఘాట్‌లో పడవ దిగి స్నానమును
గాని ప్రోక్షణమును గాని
చేసికొని,
నడచుకొంటూ
దుర్గా దేవి మందిరమునకు వెళ్ల
వలెను.
అక్కడ
దుర్గావినాయకుని,
దుర్గా
కుండమును,
దుర్గాదేవిని
దర్శించి పూజించ వలెను.
దుర్గాదేవికి
రెవిక,
నైవేద్యము
(కొబ్బరికాయ)
దక్షిణను
సమర్పించి క్రింది పునర్దర్శన
శ్లోకమును చెప్పుకొనవలెను.
18. |
ఓం దుర్గా
వినాయకాయ నమః |
దుర్గాకుండ్ |
19. |
ఓం దుర్గా
దేవ్యై నమః |
”
|
20. |
ఓం దుర్గా
కుండాయ నమః |
”
|
శ్లో॥ జయ
దుర్గే మహాదేవి!
జయ కాశీనివాసిని!
క్షేత్ర
విఘ్నహరే దేవి పునర్దర్శన
మస్తుతే ॥
మరల అక్కడినుండి
అసీ ఘాట్‌నకు మరలి వచ్చి,
పూర్వ
యాత్రా మార్గమును కలుపు
కొనుచూ,
పంచక్రోశీ
మార్గములో రోడ్డుకు ఎడమవైపున
నడచుచూ యాత్రను కొనసాగించవలెను.
21. |
ఓం విష్వక్సేనేశ్వరాయ
నమః |
కరమైతాపూర్
గ్రామము (హిందూ
విశ్వవిద్యాలయమునకు ముందు) |
మొదటి
మజిలీ కర్దమేశ్వరుడు.
ధూళి
దర్శనమును చేసికొని,
వసతి
ప్రదేశమునకు వెళ్లవలెను.
అనంతరము
కర్దమేశ్వర తీర్థములో
స్నానమొనర్చి,
పితరులనుద్దేశించి
తిల తర్పణాదులను చేయవలెను.
తరువాత
అక్కడి దేవతా మూర్తులను
దర్శించి పూజించవలెను.
కర్దమేశ్వరునకు
అభిషేకమును చేయవలెను.
22. |
ఓం ఆది కర్దమేశ్వర
తీర్థాయ నమః |
కందవా గ్రామము |
23. |
ఓం సోమనాథేశ్వరాయ
నమః |
”
|
24. |
ఓం విరూపాక్షగణాయ
నమః |
”
|
25. |
ఓం నీలకంఠేశ్వరాయ
నమః |
”
|
26. |
ఓం కర్దమేశ్వరాయ
నమః |
”
|
27. |
ఓం కర్దమ కూపాయ
నమః |
”
|
ఇచ్చట
కర్దమ కూపములో తన ముఖ ప్రతిబింబమును
చూచుట సంప్రదాయము.
మధ్యాహ్నమునందు
హవిషాన్నమునుతిని,
సాయం సమయమున
స్తోత్రపారాయణలు,
భజనలతో
కాలక్షేపము చేయవలెను.
2 వ
రోజు యాత్ర
ప్రాతః
కాలమున స్నానాదులను ముగించుకొని,
ఆ మజిలీయందలి
దేవతలను దర్శించి,
క్రింది
పునర్దర్శన మంత్రమును చదివి
శ్లో॥ కర్దమేశ
మహాదేవ కాశీవాసి జనప్రియ
త్వత్పూజనాన్మహాదేవ
పునర్దర్శన మస్తుతే ॥
పంచక్రోశాత్మకాయ,
మహాలింగాయ,
జ్యోతిర్లింగ
స్వరూపాయ,
కాశీ
విశ్వేశ్వరాయ,
శ్రీ
శివాయ నమః
అని పల్కుచు
2వ
రోజు యాత్రను ఆరంభించవలెను.
రెండవ మజిలీ భీమచండికి వెళ్లు మార్గములో దేవతలు
28. |
ఓం నాగనాధేశ్వరాయ
నమః |
అమరా గ్రామము |
29. |
ఓం చాముండా
దేవ్యై నమః |
”
|
30. |
ఓం మోక్షేశ్వరాయ
నమః |
దేహనా గ్రామము |
31. |
ఓం కరుణేశ్వరాయ
నమః |
”
|
32. |
ఓం వీరభద్ర
గణాయ నమః |
”
|
33. |
ఓం వికటాక్ష
దుర్గా దేవ్యై నమః |
”
|
34. |
ఓం ఉన్మత్త
భైరవాయ నమః |
దేఉరా గ్రామము |
35. |
ఓం నీలకంఠ
గణాయ నమః |
”
|
36. |
ఓం కాలకూట
గణాయ నమః |
”
|
37. |
ఓం విమలాదుర్గా
దేవ్యై నమః |
”
|
38. |
ఓం మహా దేవేశ్వరాయ
నమః |
”
|
39. |
ఓం నందికేశ్వరాయ
నమః |
”
|
40. |
ఓం భృంగీరీటగణాయ
నమః |
”
|
41. |
ఓం గణప్రియేశ్వరాయ
నమః |
”
|
42. |
ఓం విరూపాక్ష
గణాయ నమః |
గౌరా గ్రామము |
43. |
ఓం యక్షేశ్వరాయ
నమః |
చక్ మాతల్ దేఈ
గ్రామము |
44. |
ఓం విమలేశ్వరాయ
నమః |
ప్రయాగ్‌పుర
గ్రామము |
45. |
ఓం మోక్షేశ్వరాయ
నమః |
”
|
46. |
ఓం జ్ఞానదేశ్వరాయ
నమః |
”
|
47. |
ఓం అమృతేశ్వరాయ
నమః |
అసవారీ గ్రామము |
48. |
ఓం గంధర్వ
సాగర భీమచండీ తీర్థాయ నమః |
భీమచండీ గ్రామము |
49. |
ఓం నరకార్ణవతార
శివాయ నమః |
”
|
50. |
ఓం గంధర్వేశ్వరాయ
నమః |
”
|
51. |
ఓం భీమచండ
వినాయకాయ నమః |
”
|
52. |
ఓం రవిరక్తాక్ష
గంధర్వాయ నమః |
”
|
53. |
ఓం భీమచండీ
దేవ్యై నమః |
”
|
ఇక్కడ
గంధర్వ సాగర తీర్థమందు స్నానమును
చేసి, భీమచండీ
దేవికి రవిక,
పసుపు,
కుంకుమ,
కొబ్బరికాయ,
దక్షిణ
సమర్పించి,
అభిషేకము,
పితృశ్రాద్ధ
తర్పణాదులను చేసి,
చండ వినాయక,
రవిరక్తాక్ష
గంధర్వ,
నరకార్ణవ
తారక శివులను పూజించవలెను.
అనంతరము
హవిషాన్న భోజనము,
సత్సంగాదులు
చేయవలెను.
3 వ
రోజు యాత్ర
ప్రాతః
కాలమునందు స్నానాదులను
ముగించుకొని,
భీమచండిని
దర్శించి,
క్రింది
పునర్దర్శన శ్లోకమును పఠించి
తృతీయ దిన యాత్రను ప్రారంభించవలెను.
శ్లో॥ భీమ
చండి!
ప్రచండాని!
మమ విఘ్నాని
నాశయ !
నమస్తేస్తు
గమిష్యామి పునర్దర్శనమస్తుతే
॥
మూడవ
మజిలీ రామేశ్వరము.
భీమచండీ
- రామేశ్వరము
మధ్యగల దేవతా మూర్తులు
54. |
ఓం ఏకపాదశివగణాయ
నమః |
కచనార్ గ్రామము |
55. |
ఓం మహాభీమగణాయ
నమః |
హరపుర గ్రామము |
56. |
ఓం భైరవాయ నమః |
హరశోత్ గ్రామము |
57. |
ఓం భైరవీ దేవ్యై
నమః |
”
|
58. |
ఓం భూతనాథేశ్వరాయ
నమః |
దీన్ దాస్ పుర
గ్రామము |
59. |
ఓం సింధు
సరోవరాయ నమః |
”
|
60. |
ఓం సోమనాథేశ్వరాయ
నమః |
లంగోటియా
హనుమాన్ జీ |
61. |
ఓం కాలనాథేశ్వరాయ
నమః |
జన్సా గ్రామము |
62. |
ఓం కపర్దీశ్వరాయ
నమః |
”
|
63. |
ఓం కామేశ్వరాయ
నమః |
చౌఖండీ గ్రామము |
64. |
ఓం గణేశ్వరాయ
నమః |
”
|
65. |
ఓం వీరభద్ర
శివగణాయ నమః |
”
|
66. |
ఓం చారుముఖ
శివగణాయ నమః |
”
|
67. |
ఓం గణనాథేశ్వరాయ
నమః |
భటౌలీ |
68. |
ఓం దేహలీ
వినాయకాయ నమః |
”
|
ఇక్కడ 16 వినాయకులు గలరు. ఈ షోడశ వినాయకులను పూజించి, తెల్లనువ్వు లడ్డులను నివేదించి, మంచినీళ్లు త్రాగి 15 నిముషములు విశ్రమించవలెను.
69. |
ఓం ఉద్దండ
వినాయకాయ నమః |
భూఇలీ గ్రామము |
70. |
ఓం ఉత్కలేశ్వరాయ
నమః |
”
|
71. |
ఓం రుద్రాణీ
దేవ్యై నమః |
రుద్రాణి
తపోభూమి,
హీరమపురము |
రుద్రాణి
తపోభూమి యందు జపము సిద్ధి
ప్రదము.
యధాశక్తి
జపమును చేయదగును.
72. |
ఓం రామేశ్వర
తీర్థాయ నమః |
రామేశ్వరము,
వరణానదీ
తీర్థము |
73. |
ఓం సోమేశ్వరాయ
నమః |
”
|
74. |
ఓం భరతేశ్వరాయ
నమః |
”
|
75. |
ఓం లక్ష్మణేశ్వరాయ
నమః |
”
|
76. |
ఓం శత్రుఘ్నేశ్వరాయ
నమః |
”
|
77. |
ఓం ద్యావాభూమీశ్వరాయ
నమః |
”
|
78. |
ఓం నహుషేశ్వరాయ
నమః |
”
|
79. |
ఓం రామేశ్వరాయ
నమః |
”
|
మూడవ
మజిలీయగు రామేశ్వరమందు
వరుణానదిలో స్నానము,
పితృ తర్పణ
శ్రాద్ధాదులను యథానుకూలముగ
చేయవలెను.
అక్కడి
భరతేశ్వరాదులను దర్శించి
పూజించవలెను.
రామేశ్వరుని
తెల్ల నువ్వులు,
మారేడు
దళములు,
గంగా జలముతో
అభిషేకించి,
నివేదనలు
సమర్పించి దక్షిణలిచ్చుకొనవలెను
(రామేశ్వరునకు
గంగా జలాభిషేకం విశేష ఫలప్రదము.
సాయంత్రం
సత్సంగాదులతో కాలక్షేపము).
4 వ
రోజు యాత్ర
ప్రాతః
కాలమునందు స్నానాదులను
ముగించుకొని,
రామేశ్వరుని
దర్శించి,
పూజించి,
క్రింది
పునర్దర్శన శ్లోకమును పఠించి
యాత్రారంభము సేయవలెను.
శ్లో॥ శ్రీ
రామేశ్వర రామేణ పూజితస్త్వం
సనాతన
ఆజ్ఞాం
దేహి మహాదేవ పునర్దర్శన
మస్తుతే ॥
రామేశ్వరము -
శివపురముల
మధ్య గల దేవతా మూర్తులు
80. |
ఓం అసంఖ్యాత
శివలింగేశ్వరాయ నమః |
వరుణా తీరములో
- రామేశ్వరము |
81. |
ఓం దేవ సంధ్యేశ్వరాయ
నమః |
కరౌమా గ్రామము |
82. |
ఓం ద్రౌపదీదేవ్యై
నమః |
శివపురము |
83. |
ఓం ద్రౌపదీశ్వరాయ
నమః |
”
|
84. |
ఓం యుధిష్ఠిరేశ్వరాయ
నమః |
”
|
85. |
ఓం భీమేశ్వరాయ
నమః |
”
|
86. |
ఓం అర్జునేశ్వరాయ
నమః |
”
|
87. |
ఓం నకులేశ్వరాయ
నమః |
”
|
88. |
ఓం సహదేవేశ్వరాయ
నమః |
”
|
89. |
ఓం కృష్ణేశ్వరాయ
నమః |
”
|
90. |
ఓం పరీక్షితేశ్వరాయ
నమః |
”
|
91. |
ఓం కున్తీశ్వరాయ
నమః |
”
|
92. |
ఓం ద్రౌపదీ
కూపాయ నమః |
”
|
4వ
మజిలీ యగు శివపురిలో ద్రౌపదీ
కూపమునందు స్నానమొనర్చి,
పితృతర్పణాదులొనర్చి,
ద్రౌపదీదేవిని,
ద్రౌపదీశ్వరాదులను
దర్శించి పూజించవలెను.
సాయంత్రము
సత్సంగాదులతో కాలమును గడుపవలెను.
5 వ
రోజు యాత్ర
ప్రాతః
కాలమునందు స్నానాదులను
ముగించికొని శివపురిలోని
దేవతామూర్తులను దర్శించి,
క్రింది
పునర్దర్శన శ్లోకమును పఠించి
యాత్రను ప్రారంభించ వలెను.
శ్లో॥ పాండవేశ
మహాదేవ పాండునందన పూజిత
తవ
పూజాం కరిష్యామి పునర్దర్శనమస్తుతే
॥
5 వ మజిలీ కపిలధార
శివపురి - కపిలధార మధ్యగల దేవతా మూర్తులు
93. |
ఓం పాశపాణి
వినాయకాయ నమః |
కంటోన్మెంట్
ఏరియా -
సదర్ బజార్ |
94. |
ఓం పృధ్వీశ్వరాయ
నమః |
ఖజురీ బజార్ |
95. |
ఓం స్వర్గభూమి
దేవ్యైనమః |
సారంగతాలాబ్ |
96. |
ఓం యూపసరోవర
తీర్థాయ నమః |
దీనదయాళ్‌పుర్ |
97. |
(ఇక్కడ
తీర్థ ప్రోక్షణ,
సువర్ణదానాదులు) |
|
98. |
యూపసరోవరేశ్వరాయ
నమః |
దీనదయాళ్‌పుర్ |
99. |
ఓం వృషభధ్వజ
తీర్థాయ నమః |
కపిల ధార |
100. |
ఓం వృషభధ్వజేశ్వరాయ
నమః |
”
|
5వ
మజిలీయగు కపిలధారయందు,
కపిలధారా
తీర్థమున స్నానము,
పితృదేవతలనుద్దేశించి
పిండ శ్రాద్ధ తర్పణాదులు
అవశ్యము సేయవలెను.
వృషభధ్వజేశ్వరునకు
అభిషేకము చేయవలెను.
ప్రాంగణమందలి
దేవతామూర్తులను దర్శించి,
కపిల
తీర్థమునకు ప్రదక్షిణము
సేయవలెను.
అమావాస్యతో
కూడిన సోమవారమునందు ఇక్కడ
శ్రాద్ధము గయా శ్రాద్ధముకంటె
అధిక ఫలప్రదము.
పిమ్మట
సాయంకాలమునందు సత్సంగాదులు.
కపిల
తీర్థమునకు గల (1)
మధుస్రవా,
(2) కృతకృత్యా,
(3) క్షీరనీరధి,
(4) వృషధ్వజతీర్థ,
(5) పైతామహ
తీర్థ, (6)
గంగాధరతీర్థ,
(7) పితృతీర్థ,
(8) కపిల ధార,
(9) సుధాఖని,
(10) శివగయా
అను నామములను ఉచ్చరించుట వలన
పితృదేవతలు సంతృప్తిని
పొందుదురు.
6 వ
రోజు యాత్ర
ప్రాతః
కాలమునందు స్నానాదికములను
నిర్వర్తించి,
వృషభధ్వజుని
దర్శించి,
పూజించి
క్రింది పునర్దర్శన శ్లోకమును
పఠించి యాత్రను కొనసాగించవలెను.
శ్లో॥ వృషభధ్వజ
దేవేశ పితౄణాం ముక్తిదాయక
ఆజ్ఞాం
దేహి మహాదేవ!
పునర్దర్శన
మస్తుతే ॥
101. |
ఓం జ్వాలా
నృసింహాయ నమః |
కోటవా గ్రామము |
102. |
ఓం యవ వినాయకాయ
నమః |
గంగాతీరమునందు |
ఈ యవ
వినాయకునకు 5
గుప్పిళ్లు
యవలు సమర్పించి బ్రాహ్మణునకు
మోయన (స్వయంపాకము),
దక్షిణ
ఈయవలెను.
గమనిక
:
ఇక్కడినుండి
పడవపై వెళ్లువారు ఓం శ్రీ
విష్ణవే నమః అని పలుకుచూ
కొద్ది కొద్దిగా యవలు చల్లుచూ
వరుణా గంగా సంగమమువరకు
వెళ్లవలెను.
అక్కడ
పడవను దిగి స్నానమును చేసి
అక్కడి దేవతా మూర్తులను
దర్శించి పూజించాలి.
103. |
ఓం వరుణా గంగా
సంగమ తీర్థాయ నమః |
ఆది కేశవ |
104. |
ఓం గంగా వరుణా
సంగమేశ్వరాయ నమః |
”
|
105. |
ఓం ఆదికేశవ
విష్ణవే నమః |
”
|
106. |
ఓం జ్ఞానకేశవాయ
నమః |
”
|
107. |
ఓం ఖర్వవినాయకాయ
నమః |
”
|
అనంతరము
పడవనెక్కి గంగా తీరమందలి
దేవతా మూర్తులను స్మరించుచూ
ఓం శ్రీ విష్ణవే నమః యని యవలు
చల్లుచు మణికర్ణిక వరకు
వెళ్లవలెను.
108. |
ఓం ప్రహ్లాదేశ్వరాయ
నమః |
ప్రహ్లాద్
ఘాట్ |
109. |
ఓం త్రిలోచనేశ్వరాయ
నమః |
త్రిలోచన ఘాట్ |
110. |
ఓం బిందుమాధవ
విష్ణవే నమః |
పంచగంగా ఘాట్ |
111. |
ఓం గభస్తీస్వరాయ
నమః |
మంగళాగౌరీ
మందిరం |
112. |
ఓం మంగళాగౌరీ
దేవ్యై నమః |
”
|
113. |
ఓం వశిష్ఠేశ్వరాయ
నమః |
సింధియా ఘాట్ |
114. |
ఓం వామదేవేశ్వరాయ
నమః |
”
|
115. |
ఓం పర్వతేశ్వరాయ
నమః |
”
|
మణికర్ణికా ఘాట్ లో పడవ దిగి క్రింది దేవతా మూర్తులను దర్శించాలి.
116. |
ఓం మహేశ్వరాయ
నమః |
మణికర్ణికా
ఘాట్ |
117. |
ఓం సిద్ధి
వినాయకాయ నమ |
”
|
118. |
ఓం సప్తావరణ
వినాయకాయ నమః |
బ్రహ్మనాళ్ |
సప్తావరణ
వినాయకునకు మిగిలిన యవలను
సమర్పించవలెను.
అచ్చట
బ్రాహ్మణునకు మోయన (స్వయంపాకము),
దక్షిణలిచ్చి
మణికర్ణికా ఘాట్ లో స్నానమును
చేయవలెను.
అనంతరము
విశ్వనాథుని మందిరమునకు
రావలెను.
గమనిక
:
యవ
వినాయకునినుండి నడచివచ్చు
వారు వరణా నదిని దాటి,
ఆది
కేశవుని యొద్ద పాదోదక తీర్థమున
స్నానమొనర్చి,
అక్కడినుండి
గంగా తీరమందలి చూడవలసిన దేవతా
మూర్తులను దర్శించి పూజించుచూ
మణికర్ణికా ఘాట్ వరకు రావలెను.
119. |
ఓం విష్ణవే
నమః |
అన్నపూర్ణా
మందిరం |
120. |
ఓం ఢుంఢి
రాజాయనమః |
ఢుంఢిరాజ
గల్లీ -
సావిత్రీ
పాటక్ |
121. |
ఓం దండపాణయే
నమః |
ఢుంఢిరాజ
గల్లీ |
122. |
ఓం సాక్షీ
వినాయకాయ నమః |
సాక్షి వినాయక |
123. |
ఓం ద్రౌపదాదిత్యాయ
నమః |
అన్నపూర్ణ
గల్లీ
(అక్షయ వటము దగ్గర) |
124. |
ఓం మోదాది
పంచవినాయకేభ్యో నమః |
విశ్వనాథ సభ
(ముక్తి మండపము) |
125. |
ఓం విశ్వనాథాయ
నమః |
విశ్వనాథ
మందిరము |
విశ్వనాథునకు మరల మరల నమస్కరించి క్రింది విధముగా ప్రార్థించవలెను.
శ్లో॥ జయ
విశ్వేశ విశ్వాత్మన్ కాశీ
నాథ జగద్గురో
త్వత్ప్రసాదాత్
మహాదేవ!
కృతా క్షేత్ర
ప్రదక్షిణా ॥
శ్లో॥ అనేక
జన్మ పాపాని కృతాని మమ శంకర
గతాని
పంచ క్రోశాత్మ లింగస్యాస్య
ప్రదక్షిణాత్ ॥
శ్లో॥ త్వద్భక్తిం
కాశివాసంచ రాహిత్యం పాప
కర్మణామ్
సత్సంగ
శ్రవణాద్యైశ్చ కాలో గచ్ఛతు
నః సదా ॥
శ్లో॥ హర
శంభో మహాదేవ సర్వజ్ఞ సుఖదాయక
ప్రాయశ్చిత్తం
సునిర్వృత్తం పాపానాం
త్వత్ప్రసాదతః॥
శ్లో॥ పునః
పాపమతిర్నాస్తు ధర్మబుద్ధి
స్సదాస్తుమే
పంచక్రోశస్య
యాత్రేయం యథా శక్తి మయాకృతా
॥
అనంతరము
జ్ఞానవాపి సమీపమందు వ్యాసపీఠము
దగ్గర కూర్చుండి పంచక్రోశ
ప్రదక్షిణయందు దర్శించిన
గణ దేవతలను స్మరించి,
అక్షతలు
సమర్పించి,
అచ్చటి
బ్రాహ్మణునిచే ఉత్తర సంకల్పమును
చెప్పించుకొని,
మోయన
(స్వయంపాకము),
దక్షిణలు
సమర్పించవలెను.
ఆ
పిమ్మట కాలభైరవుని దర్శించి
తమ నివాసస్థలమున కేగవలెను.
ఆరోజున
గానీ, వీలైనంత
త్వరలో గాని యధా శక్తి బ్రాహ్మణ
భోజనాదులను ఏర్పాటు చేయవలెను.
ఈ
యాత్ర కాశీ కృత పాపములకు
ప్రాయశ్చిత్తము.
No comments:
Post a Comment