గంగా పుష్కరములు - 2011
వారణాశి
పుష్కరములకు విచ్చేయుచున్న యాత్రీకులకు
హార్ధిక శుభాకాంక్షలు
శ్రీ ఖర నామ సంవత్సరంలో వైశాఖ శుక్ల పంచమీ ఆదివారంనాడు (అనగా మే 8, 2011న ఉదయం 3.30 ని.) గురుడు మేష రాశిలో ప్రవేశించడంతో భారతీయులకు పరమ పావనమైన గంగానదికి పుష్కరములు వచ్చుచున్నవి. పన్నెండు రోజులు అనగా వైశాఖ కృష్ణ విదియ (మే 19, 2011) వరకు పుష్కరుడు గంగానదిలో ఉండడం వల్ల గంగా స్నానం మరియు పితృదేవతలకు చేయు తర్పణాదులకు విశేష ఫలితము కలుగును. కాశీలో గంగ ఉత్తర వాహినిగా ప్రవహించడంవల్ల, విశ్వేశ్వరుడు కొలువైనందువల్ల హిందువులు కాశీలో గంగా స్నానము చేయుటకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. ఈ సంవత్సర కాలము మధ్యాహ్నము 12.00 గం. లకు పుష్కరుడు గంగానదిలో ఉండుట వల్ల ఆ సమయములో చేయు స్నాన, దాన, పితృ కార్యక్రమములకు పుష్కరములలో చేసిన ఫలితమే కలుగును.
కాశీలో వసతి భోజన సౌకర్యములు కలిగిస్తున్న వివిధ సత్రముల వివరములను, పురోహితుల వివరములను కలిగిన ఒక కరపత్రమును ప్రకటించిన కాశీ వచ్చుచున్న యాత్రీకులకు అనువుగానుండు నను ఉద్దేశ్యముతో శ్రీ కాశీ తెలుగు సమితి సభ్యులు ఈ కరపత్రమును ప్రకటించుచున్నారు.
దీనిలోని వివరములు యాత్రీకులకు తమ యాత్రను విజయవంతం గాపూర్తి చేసుకోవడానికి సహకరిస్తాయని మేము ఆశిస్తున్నాము.
| ఇట్లు కార్య వర్గ సభ్యులు శ్రీ కాశీ తెలుగు సమితి |
కాశీ లోని తెలుగు వారి సత్రములు మరియు ఆశ్రమములు
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం, బి. 14/15, మాన సరోవర్ | 2451953 |
అన్నపూర్ణ ప్రాంతీయ సేవా ఆశ్రమమము, బి. 6/112 కేదార ఘాట్, సోనార్ పురా | 2277868, 6535002 |
కాశీ అన్నపూర్ణ యాత్రీ భవనము, బి. 14/91, మాన సరోవర్ | 9839050325 |
కాశీ ఆర్య వైశ్య వాసవీ నిత్యాన్న సత్రం డి. 47/143 రమాపురా, మిశ్రంబు ఎదురుగా, లక్సారోడ్ | 2451534 |
శ్రీ కాశీ వైశ్య సత్ర సంఘం (గుంటూరు వైశ్య సత్రం), బి. 14/15, క్షేమేశ్వర ఘాట్ | 2452947 |
శ్రీ మార్కండేయ ఆశ్రమం, బి. 71/192 కేదార ఘాటు | 9889707658 |
శ్రీ నిర్మల శివానంద ఆశ్రమము, బి. 15/35-C పాండే హవేలీ | 2450178 |
శ్రీ రామతారక ఆంధ్రా ఆశ్రమము, బి. 14/92 మానసరోవర్ | 2450418 |
శ్రీ శృంగేరి శంకర మఠం, బి. 14/111 కేదార ఘాట్ | 2452768 |
శ్రీ తారక రామా నివాస్ (క్షత్రియ సత్రం), బి. 5/281 అవధ్ గర్భి, హనుమాన్ ఘాట్ | 2277477 |
శ్రీ వెల్లంపల్లి రాఘవయ్య మరియు రాఘవమ్మ కాశీ నిత్యాన్నదాన సత్రం | 2452339 |
ఇవి కాక తమిళుల, హిందీ వారి సత్రములలో కూడా తెలుగువారికి బస ఇస్తారు. వాటిలో ముఖ్యమయినవి కుమారస్వామి మఠం (తమిళులది), కేదార ఘాట్ వద్ద పాండే ధర్మశాల, లక్సా రోడ్ మరియు హరసుందరీ ధర్మశాల, గదోలియా.
అన్నపూర్ణ మందిరములో ఉదయం 11.00 గం. నుండి సాయింత్రం 3.00 గం. వరకూ అన్నదానము జరుగుతుంది।
మరిన్ని వివరములు రేపటి పోస్టులో
No comments:
Post a Comment