Thursday, May 5, 2011

గంగా పుష్కరములు - ४ భాగము - చేయవలసిన విధులు

పుష్కరములలో చేయవలసిన కార్యక్రమములు

పుష్కర నదీ స్నానం

కాశీలో స్నానం చేయునపుడు చెప్పుకొనవలసిన సంకల్పం

... ... ... ... శుభే శోభనే మహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే, అష్టా వింశతితమే కలియుగే, ప్రథమ పాదే, విక్రమ శకే, బౌద్ధావతారే, జమ్బూద్వీపే, భరతవర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, వింధ్యస్యోత్తర ఆర్యావర్తైకదేశే, అసీ వరణయో ర్మధ్యే, అవిముక్త వారాణసీ క్షేత్రే, ఆనందవనే, మహాశ్మశానే, గొరీ ముఖే, త్రికంటక విరాజతే , ఉత్తర వాహిన్యాః భాగీరథ్యాః పశ్చిమేతీరే, బ్రహ్మనాళే, మహామణికర్ణికా క్షేత్రే, శ్రీ విశ్వేశ్వరాది త్రయస్త్రిం శత్కోటి దేవతా గోబ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ, అస్మిన్ వర్తమాన వ్యావహారిక బార్హస్వత్య మానేన క్రోధి నామ సంవత్సరే, చాంద్ర సౌరమానాభ్యాం ఖర నామ సంవత్సరే ఉత్తరాయణే , వసంత ఋతౌ, వైశాఖ మాసే, ... ... ... పక్షే, ... ... ... శుభ తిథౌ ... ... ... వాసరే, శుభ నక్షత్రే, శుభ యోగే, శుభ కరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభ తిథౌ శ్రీమాన్/ శ్రీమతీ … … --- --- --- గోత్రః / గోత్రా … … … --- --- --- నామ ధేయః / నామధేయా శ్రీ మతః/శ్రీమత్యాః --- --- --- గోత్రస్య / గోత్రాయాః … --- --- --- నామ ధేయస్య / నామ ధేయాయాః ధర్మపత్నీ సమేతస్య / సభర్తృకాయాః సహకుటుంబస్య / సహ కుటుంబాయాః మమ క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్ధం ధర్మార్ధ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహజన్మని జన్మ జన్మాంతరేషు మనోవాక్కాయ కర్మభిః జ్ఞానాజ్ఞానకృత సర్వ పాపక్షయార్థం శ్రీ విశాలాక్షీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవతా ప్రీత్యర్థం మహామణికర్ణికా / భాగీరథీ స్నాన మహం కరిష్యే.


పుష్కర సమయంలో నదీస్నానమే కాక పితృదేవతలకు పిండ ప్రదానం చేయడం కూడా ముఖ్యం. అందువల్ల ఈ దిగువ తెలిపిన మీ పూర్వీకుల వివరములు (పేరు, గోత్రం మొదలయినవి) తప్పక తెలుసుకుని తెచ్చుకోండి.


పితరం (తండ్రి) గోత్రం శర్మాణం* వసురూపం
పితామహం (తాత) గోత్రం శర్మాణం రుద్రరూపం
ప్రపితామహం (ముత్తాత) గోత్రం శర్మాణం ఆదిత్యరూపం
మాతరం (తల్లి) గోత్రం దాయీం వసురూపం
పితామహీం (మామ్మ) గోత్రం దాయీం రుద్రరూపం
ప్రపితామహీం (ముత్తమ్మ) గోత్రం దాయీం ఆదిత్యరూపం
సపత్నీమాతరం (సవతితల్లి) గోత్రం దాయీం వసురూపం
మాతామహం (తల్లి తండ్రి) గోత్రం శర్మాణం వసురూపం
మాతుః పితామహం (తల్లి తాత) గోత్రం శర్మాణం రుద్రరూపం
మాతుః ప్రపితామహం (తల్లి ముత్తాత)గోత్రం శర్మాణం ఆదిత్యరూపం
మాతామహీం (అమ్మమ్మ) గోత్రం దాయీం వసురూపం
మాతుః పితామహీం (తల్లి మామ్మ) గోత్రం దాయీం రుద్రరూపం
మాతుః ప్రపితామహీం (తల్లి ముత్తమ్మ) గోత్రం దాయీం ఆదిత్యరూపం
ఆత్మ పత్నీం (భార్య) గోత్రం దాయీం వసురూపం
సుతం (కుమారుడు) గోత్రం శర్మాణం రుద్రరూపం
భ్రాతరం (సోదరుడు) గోత్రం శర్మాణం ఆదిత్యరూపం
పితృవ్యం (తండ్రి సోదరుడు) గోత్రం శర్మాణం వసురూపం
మాతులం (తల్లి సోదరుడు) గోత్రం శర్మాణం రుద్రరూపం

మాతులస్య పత్నిం (మేమమామ భార్య) గోత్రం దాయీం రుద్ర రూపం
దుహితరం (కూతురు) గోత్రం దాయీం వసురూపం
ఆత్మభగినీం (సోదరి) గోత్రం దాయీం వసురూపం
దౌహిత్రం (కూతురి కొడుకు) గోత్రం దాయీం వసురూపం
భాగినేయకం (మేనల్లుడు) గోత్రం శర్మాణం
పితృభగినీం (తండ్రి సోదరి) గోత్రం దాయీం వసురూపం

పితృభగినీ భర్తారం (మేనత్త భర్త) గోత్రం శర్మాణం వసురూపం
పితృభగినీ సుతం (మేనత్తల కుమారులు) గోత్రం శర్మాణం వసురూపం

మాతృభగినీం (తల్లి సోదరి) గోత్రం దాయీం వసురూపం
మాతృభగినీం భర్తారం (పైవారి భర్తలు) గోత్రం శర్మాణం వసురూపం

మతృభగినీ సుతం (పైవారి కుమారులు) గోత్రం శర్మాణం వసురూపం

జామాతరం (అల్లుడు) గోత్రం శర్మాణం వసురూపం
భావుకం (బావ, బావమరిది) గోత్రం శర్మాణం వసురూపం
స్నుషాం (కోడలు) గోత్రం దాయీం వసురూపం
స్వశురం (భార్య తండ్రి) గోత్రం శర్మాణం వసురూపం
స్వశ్రూం (అత్తగారు) గోత్రం దాయీం వసురూపం
శ్యాలకం (భార్య అన్న, తమ్ముడు) గోత్రం శర్మాణం వసురూపం

శ్యాలకస్య పత్నిం (పైవారి భార్యలు) గోత్రం దాయీం వసురూపం

స్వామిన్ (మత గురువు, పీఠాధిపతి)

గురుం (మంత్రోపదేశము, ఉపనయనము చేసినవారు) గోత్రం శర్మాణం వసురూపం

రిక్థినం (ఆస్తి నొసగినవారు, సహాయము చేసినవారు)

పితృవంశములో మృతులు

మాతృవంశములో మృతులు

బంధువర్గములో మృతులు

తనకులమందు శైశవమున, గర్భమున గతించినవారు

అగ్ని, పిడుగు, ఉరుము, మెఱుపుల వలన మృతులు

మృగములవలన హతులు

ఉరి, విషము, ఆయుధములు, ఆత్మహత్యలచే మృతులు

భూతప్రేత, పిశాచులు

రౌరవ, అంధతామిశ్ర, కాలసూత్ర నరకములలోనివారు

అసిపత్ర, కుంభీపాకములలోనివారు

ప్రేతలోకములోని వారు

యమపురములోన వారు

ఇతర నరకములలోని వారు

పశు, పక్షి, కీట, కర్ప, వృక్ష జన్మములలోనివారు

దహన సంస్కారములు జరుగక అంతరిక్ష, పాతాళములందలి వారు

జన్మాంతర బంధువర్గము

దుర్మరణము, బ్రహ్మహత్యాది పాతకులు

బంధువర్గమున సంతతి లేనివారు

దాస, భృత్య, సేవక, ఆశ్రితులు

జన్మాంతర మిత్ర, కళత్ర సుఖమునిచ్చిన ఇతరులు

జన్మాంతరమున పోషింపబడిన స్పృశింప బడినవారు

* క్షత్రియులు వర్మ అనియు, వైశ్యులు గుప్తా అనియు చెప్పుకొన వలెను.



పుష్కరములలో 12 రోజులు చేయవలసిన దానములు ,కార్యక్రమములు

మొదటి రోజు - హిరణ్య శ్రాద్ధ, అన్న శ్రాద్ధ, ధాన్య, భూ, రజిత దానములు

రెండవ రోజు - గో, మణి, లవణ, వస్త్ర దానములు

మూడవ రోజు - గో, గుడ, ఫల, శాక దానములు

నాల్గవ రోజు - తైల, క్షీర, ఘృత దానములు

అయిదవ రోజు - ధాన్య, నాగలి, వృషభ, మహిష దానములు

ఆరవ రోజు - ఘనసార, కస్తూరి, చందన, ఔషధ దానములు

ఏడవ రోజు - గృహ, శయ్య, పీఠ, ఆందోళికా దానములు

ఎనిమిదవ రోజు - పుష్ప, చందన, కందమూల దానములు

తొమ్మిదవ రోజు - పితృశ్రాద్ధ, పిండదాన, కన్యాదానములు

పదవ రోజు - పుష్ప, మక్తాహార, రజత దానములు

పదకొండవ రోజు - యజ్ఞోపవీత, పుస్తక, తాంబూల దానములు

పన్నెండవ రోజు - షోడశ, దశ దానములు



కాశీలో చూడవలసిన ప్రదేశములు

శ్రీ కాశీ విశ్వేశ్వర మందిరం, శ్రీ అన్నపూర్ణ మందిరం, శ్రీ విశాలాక్షి మందిరం, శ్రీ సాక్షి గణపతి, శ్రీ డుంఢి గణపతి, శ్రీ కాలభైరవుడు, శ్రీ దండపాణి, శ్రీ కాశీ మాత (కాశీ గ్రామ దేవత), ఓంకారేశ్వరుడు, శ్రీ సంకట మోచన్ హనుమాన్ మందిరం, శ్రీ తులసీ మానస మందిరం, కాశీ హిందూ విశ్వవిద్యాలం లోని శ్రీ విశ్వనాథ మందిరం (దీనినే బిర్లా మందిరం అని కూడా అంటారు), శ్రీ దుర్గా దేవి (దుర్గా కుండ్), శ్రీ కౌడీ భాయి (దుర్గా కుండ్ వద్ద ఉన్నది), శ్రీ లలితా దేవి, శ్రీ వారాహీ దేవి (లలితా ఘాటులో), బిందు మాధవ మందిరం మరియు తెలంగ స్వామి మఠం (పంచ గంగా ఘాటు), సారనాథ్ లో సారంగనాథ మందిరం మరియు బౌద్ధ మందిరములు (ఇక్కడి పురాతత్వ ప్రదర్శన శాలలో భారత ప్రభుత్వ చిహ్నమయిన మూడు సింహముల స్థంభము ఉన్నది) .

రామనగర్ (దీనినే వ్యాస కాశీ అంటారు) కోట మరియు కోటలో నుండి గంగ ఒడ్డున ఉన్న వ్యాస మరియు శుక స్థాపిత శివలింగములు.




విషయ సేకరణ

జానపాటి బాల నరస అప్పేశ్వర శాస్త్రి, కాశీ వాసి

మారేపల్లి గోపాల కృష్ణ శాస్త్రి, ఉభయ భాషా ప్రవీణ, కాకినాడ

దువ్వూరి వేణు గోపాల్, కా.హి.వి.వి., వారణాసి


ఈ విషయములన్నిటిని ఒక చిన్న పుస్తకముగా వేసి స్క్రిబ్డ్ లో ఉంచినాము దాని లింకు క్రింది ఈయబడినది



pushkar2

No comments:

Post a Comment