గంగా పుష్కరాలు జోరుగా సాగుతున్నాయి. యాత్రీకుల సందడి ఎక్కు అయ్యిందే కాని తగ్గలేదు.
నిన్న శ్రీమతి వెంకట సుబ్బమ్మ గారు అనే చీరాలనుండి వచ్చిన 80 సంవత్సరాల వృద్ధురాలు స్వర్గస్థులయిన సంగతి తెలిసింది. ఆమెతో వచ్చిన వారు వారి బంధువులతో మాట్లాడి వారణాసిలోనే అంత్యక్రియలు జరిపినట్లు సమాచారం.
ఆశ్రమాలు అన్నీ యాత్రికులతో కిటకిట లాడుతున్నాయి.
రామతారక ఆంధ్రాశ్రమంలోనే రోజూ 600 వరకూ యాత్రీకులు భోజన ఫలహార సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు.
ఆంధ్రా ఆశ్రమంలో సాయింత్రం 6.00 గం. నుండి రాత్రి 9.30 గం .వరకూ యాత్రికులకు ఉచిత వైద్య శిబిరం నడుపుతున్నారు. దీనిని డా. ఆర్. సి. కౌడి మరియు డా. నరసింహ మూర్తిగారు లు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు దాదాపుగా 25 - 30 మంది యాత్రికులు ఈ సదుపాయాన్ని ఉపయోగించు కుంటున్నారు.
12 వ తారీఖు సాయింత్రం ఆంధ్రాశ్రమంలో జరిగిన కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వర భారతి స్వాములు వారు, పీఠాధిపతులు, శ్రీ సిద్ధేశ్వర పీఠం, కుర్తాళం వారు ఇంతకు ముందు ఈ బ్లాగులో ప్రకటించిన ఆర్షధర్మము పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమములో శ్రీ ముక్తేవి సీతారామయ్యగారు, శ్రీ జానపాటి బాల నరస అప్పేశ్వర శాస్త్రిగారు, శ్రీ సుందర శాస్త్రిగారు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని శ్రీ సోమవఝల నాగేంద్ర ప్రసాద్ నిర్వహించగా, శ్రీ అప్పేశ్వర శాస్త్రిగారు పుస్తకమును రాయడంలోని ఉద్దేశాన్ని తెలియచేశారు. శ్రీ శ్రీ శ్రీ స్వామివారు తమ అనుగ్రహ భాషణమును ఇచ్చి - శుక్లాంబరధరం ... శ్లోకమునకు సరయిన అర్థాన్ని, అలాగే పుస్తకంలో ఉన్న మొదటి శ్లోకం కరాగ్రే వసతే .... కు సరయిన వివరణలనిచ్చారు.
No comments:
Post a Comment