Wednesday, September 20, 2017

పంచక్రోశి కాశీ యాత్ర - మాహాత్మ్యము - ఏడవ భాగము

యాత్రకు అవసరమగు వస్తువులు
గంగాజలము, మారేడు దళమలు, వక్కలు - 10, పూలు, ధవళాక్షతలు, నేయి, తెల్ల నువ్వులు (1/4 కిలో) (రామేశ్వరుని పూజకు), నల్ల నువ్వులు (5 మజిలీలందు తర్పణమునకు), పసుపు, కుంకుమ, పంచదార గుళ్లు, దుర్గాదేవికి, భీమచండీదేవికి రెవిక, కొబ్బరికాయ, దేహలీ వినాయకునకు తుండు గుడ్డ, అక్కడున్న 16 వినాయకులకు తెల్ల నువ్వుల లడ్లు 16, యవల పిండి 1 కిలో, దర్భలు, విస్తళ్లు (కపిల ధార దగ్గర పిండ ప్రదానము చేయువారికి మాత్రము) సుమారు రూపాయి చిల్లర నాణెములు 200, మోయనలు (స్వయంపాకములు) ఇచ్చు చోట్ల, ప్రధాన మందిరములందు దక్షిణలిచ్చు నిమిత్తము చిల్లర నోట్లు, వర్షము వచ్చినచో ఉపయోగించుటకు రెండు మైనపు కాగితములు, బ్యాటరీ లైటు, మైనపు వత్తులు, పంచదార, అటుకులు, గ్లూకోజ్ ప్యాకెట్, నిమ్మకాయలు వగైరా సొంత అవసరాలకు, చలికాలమునందు కంబళ్లు, ఉన్ని దుస్తులు, నేలపై శయనించుటకు చాప, యూప సరోవరము దగ్గర యధాశక్తిగా దానమొనర్చుటకు బంగారము, ధనము, యవలు (1/2 కిలో) (యవ వినాయకుని యొద్దనుండి సప్తావరణ వినాయకుని వరకు "శ్రీ విష్ణవే నమః" అని చెప్పుచూ చల్లుటకు), జ్ఞానవాపి దగ్గర 2, సప్తావరణ, యవ వినాయకుల దగ్గర 2, దేహలీ వినాకుని దగ్గర 1, అయిదు మజిలీలందు 5, మొత్తం 10 మోయనలు (బ్రాహ్మణ భోజనములకు బియ్యము, పెసరపప్పు, కూర వగైరా స్వయంపాకములు).
సూచన : ఈ వస్తువులను యాత్రకు బయలు దేరుటకు ముందుగా సిద్ధపరచు కొనవలెను.

No comments:

Post a Comment