Wednesday, September 20, 2017

పంచక్రోశి కాశీ యాత్ర - మహాత్మ్యము - ఎనిమిదవ భాగము

యాత్రావిధి విధానము
పంచక్రోశీ పరిక్రమ యాత్రను చేయువారు యాత్రకు పూర్వదినము నందు గంగా స్నానమును చేసి, నిత్యయాత్రను గాని, లేక విశ్వనాథ అంతర్గృహ యాత్రను గాని చేయవలెను. ఆ పిమ్మట ఢుంఢి గణపతిని దర్శించి, దక్షిణ వక్క ప్రసాదము సమర్పించి, ఈ క్రింది విధముగా ఆజ్ఞా శ్లోకమును పఠింపవలెను.
ఆజ్ఞా శ్లోకము
శ్లో॥ ఢుంఢిరాజ గణేశాన మహా విఘ్నౌఘనాశన ।
పంచక్రోశస్య యాత్రార్థం దేహ్యాజ్ఞాంకృపయా విభో ॥

No comments:

Post a Comment