యాత్రయందు
వాస విచారము
శివుడు
పార్వతికి తెలిపిన విధి
ఉత్తమమైనదిగా పురాణములందు
పేర్కొనబడినది.
ఒకరోజు
నుండి ఏడు రోజులవరకు పంచ
క్రోశీ దర్శన యాత్ర చేయు
విధానము కలదు.
- ఒకరోజు పంచక్రోశీ దర్శన యాత్రను శివరాత్రినాడు అనేకులు చేయుచున్నారు. ఈ యాత్రయందు రామేశ్వరము విశ్రామస్థానము.
- రెండు రాత్రుల పంచక్రోశయాత్రయందు భీమచండీ, రామేశ్వరములు విశ్రామ స్థానములు.
- మూడు రాత్రుల యాత్రయందు భీమచండీ, రామేశ్వరము, కపిలధారలు విశ్రామ స్థానములు.
- నాల్గు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, రామేశ్వరము, కపిలధారలు విశ్రామ స్థానములు.
- ఐదు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, రామేశ్వరము, శివపురము, కపిలధారలు విశ్రామ స్థానములు. ఆంధ్రులు ఈ పంచదిన యాత్రను చేయుచున్నారు.
- ఆరు రాత్రుల యాత్రయందు కర్దమేశ్వర, భీమచండీ, సోమనాధ (లంగోటియా హనుమాన్), రామేశ్వరము, శివపురము, కపిలధారలు విశ్రామ స్థలములు.
- ఏడు రాత్రుల యాత్రయందు దుర్గాకుండ్, కర్దమేశ్వర, భీమచండీ, దేహలీ వినాయక, రామేశ్వరము, పాశపాణి వినాయక, కపిలధారలు విశ్రామ స్థానమలు.
గమనిక
:
వరుణా
నదిని ఎట్టిపరిస్థితులందును
దాటరాదు.
రాజులు,
వృద్ధులు,
సుకుమారులగు
బాలకులు వారికి అనుకూలమగు
చోటులే విశ్రామ స్థానములు.
క్షేత్ర
సన్యాసులు సంకల్పించి పంచక్రోశీ
దర్శనయాత్రను చేయరాదు.
వారు
నగర,
వారాణసీ,
మరియు
వారాణసీ అంతర్గత యాత్రలన్నియు
చేయవచ్చును.
No comments:
Post a Comment