పంచక్రోశీ
కాశీ ప్రదక్షిణ యాత్రా
మాహాత్మ్యము
శ్లో॥ కాశ్యాం
తిష్ఠతి యోనిత్యం స్నాతి
భాగీరథీ జలే
కుర్యాత్
సాంవత్సరీ యాత్రాం పంచక్రోశస్య
సుందరి ॥
శ్లో॥ వారాణసీం
సమాసాద్య ప్రమాదాద్యో బహిర్గతః
స
దైవాత్పునరాగత్య ప్రదక్షిణేన
శుద్ధ్యతి ॥ (బ్ర.వై.పు.)
ఓ
పార్వతీ!
కాశీయందు
నివసించుచు నిత్యము గంగా
స్నానమును చేయువారు కూడ
సంవత్సరమునకొకసారి పంచక్రోశ
యాత్రను చేయవలెను.
ఎందువలననంటే
కాశీవాసి ప్రమాదవశమున గాని,
ఏదో కారణముచేత
గాని కాశీని విడిచి బయటికి
వెళ్లును.
తిరిగి
కాశీ ప్రవేశించినంతనే పంచక్రోశ
ప్రదక్షిణ వలన శుద్ధుడగును.
ఒకనాడు
జైగీషవ్యముని "ఓ
కుమారస్వామీ!
కాశీయందు
ప్రమాదమువలన చేసిన చిన్న
పెద్ద పాపముల నుండి విముక్తిని
కల్గించు సులభోపాయమును
తెలుపుము"
అని అడుగగా
కుమారస్వామి యిట్లు పల్కెను-
శ్లో॥ ప్రాయశ్చిత్తవిహీనానాం,
న శాన్తిః
కుత్రచిద్భవేత్
కింపునః
కాశికామధ్యే పాపం కృత్వా
సుఖం లభేత్॥
ప్రాయశ్చిత్తములు
చేయనివారికి పాపములు శాంతించవు.
ముక్తి
క్షేత్రమగు కాశియందు పాపములను
చేసినవారు ప్రాయశ్చిత్తము
సేయక ఎట్టి పరిస్థితులందును
సుఖమును పొందరు.
శ్లో॥ బ్రహ్మహత్యాది
పాపానాం ప్రాయశ్చిత్తం హి
కాశికా
కాశికాయాం
కృతే పాపే ప్రాయశ్చిత్తం
నవిద్యతే ॥
బ్రహ్మహత్యాది
పాపములకు ప్రాయశ్చిత్తము
కాసీ నివాసము.
కాశీ కృత
పాపములకు ప్రాయశ్చిత్తము
లేదు.
శ్లో॥ ప్రాయశ్చిత్త
విహీనానాం యాతనాస్తి సుదారుణా
జ్ఞాన
స్వరూపా కాశీయం,
పంచక్రోశే
పరిస్థితా ॥
శ్లో॥ తస్యాః
ప్రదక్షిణం కృత్వా సర్వపాపైః
ప్రముచ్యతే
ప్రాయశ్చిత్తమును
చేయనివారు రుద్ర పిశాచ రూపమై
సుదారుణమగు భైరవ యాతనలను
అనుభవించుదురు.
కాని జ్ఞాన
స్వరూపయగు కాశీ ప్రదక్షిణము
గావించిన వారు సర్వపాపములనుండి
విముక్తులగుదురు.
శ్లో॥ మమ
బ్రహ్మమయం లింగం ఆపాతాలాత్
సముపస్థితమ్
శివలోకోపరిగతమ్
అత్యతిష్ఠద్దశాంగులమ్ ॥
పాతాళ
లోకమునుండి బయటికి వచ్చిన
బ్రహ్మమయ మగు విశ్వేశ్వరలింగము
శివలోకముపైన పది అంగుళముల
వరకు వ్యాపించియున్నది.
ఈ పంచక్రోశ
పరిమాణముగల కాశియందు
సర్వత్రవ్యాప్తమైయున్నది.
శ్లో॥ ఆజన్మ
సంచితైః పాపైః ముచ్యతే
తత్ప్రదక్షిణాత్
క్షేత్రే
కృతానాం పాపానాం ప్రాయశ్చిత్తం
న చేతరం ॥
ఒక్క
పంచక్రోశీ కాశీ ప్రదక్షిణమువలన
జన్మ ప్రభృతి కావించిన
పాపములనుండి విముక్తిని
పొందుదురు.
కాశీ కృత
పాపములకు దీనికంటె భిన్నమగు
ప్రాయశ్చిత్తము లేదు.
శ్లో॥ దక్షిణే
చోత్తరేచైవ హ్యయనే సర్వదా
మయా
క్రియతే
క్షేత్రదాక్షిణ్యం భైరవస్య
భయాదపి ॥ (స.
సం.)
ఓ
పార్వతీ!
నేను (శివుడు)
భైరవ భయముచే
దక్షిణ ఉత్తరాయణములందు
సంవత్సరమున రెండు సార్లు
పంచక్రోశీ ప్రదక్షిణ యాత్రను
చేయుదును.
శ్లో॥ ప్రదక్షిణ
ద్వయం కృత్వా దశజన్మ కృతాదఘాత్
ముక్తో
భవతి పాపాత్మా సద్యో మోక్ష
మవాప్నుయాత్ ॥
రెండు
ప్రదక్షిణలు చేయుట వలన దశ
జన్మ కృతపాపముల నుండి విముక్తులై
వెంటనే ముక్తులగుదురు.
శ్లో॥ ప్రదక్షిణ
త్రయం కృత్వా పాపం జన్మశతార్జితమ్
విలయం
ప్రాపయతి నో నాత్రకార్యా
విచారణా ॥
ప్రదక్షిణ
త్రయమొనర్చుటవలన శతజన్మ కృత
పాపములనుండి విముక్తులగుదురు.
ఏ మాత్రము
సందేహము లేదు.
శ్లో॥ యావజ్జీవం
వసేత్ కాశ్యాం ప్రత్యబ్దం
సుప్రదక్షిణమ్
క్షేత్రం
ప్రదక్షిణీ కృత్య భవేత్పాపో
హి విజ్వరః ॥
యావజ్జీవము
కాశీయందు నివసించవలెను.
ప్రతి
సంవత్సరము అలసత్వమును వీడి
ఆనందవనమగు కాశీకి ప్రదక్షిణమును
చేసి పాపరహితులు కావలెను.
శ్లో॥ ప్రత్యబ్దం
యే ప్రకుర్వంతి పంచక్రోశ
ప్రదక్షిణామ్
జీవన్ముక్తాస్తు
తే జ్ఞేయాః నిష్పాపాః కాశి
వాసినః ॥
ప్రతి
సంవత్సరము పంచక్రోశీ ప్రదక్షిణ
గావించు కాశీ వాసులు జీవన్ముక్తులు,
పాప రహితులు.
శ్లో॥ కాశీ
ప్రదక్షిణా యేన కృతా త్రైలోక్య
పావనీ
సప్తద్వీపా
సాబ్ధి శైలా భూః పరిక్రామితాఽమునా
॥
ఓ
పార్వతీ!
త్రైలోక్య
పావనియగు కాశీ ప్రదక్షిణను
చేసిన వారు సప్తద్వీపములు,
సప్త
సముద్రములు,
పర్వతములతో
కూడిన భూమిని ప్రదక్షిణించిన
వారితో సమానులు.
వారు
సర్వపాపవిముక్తులై జన్మరహితులై
శివసాయుజ్యమును పొందుదురు.
No comments:
Post a Comment