Monday, December 1, 2008

ముందు మాట

కాశీలో చాలా రోజుల నుండి కాశీ వాసం చేస్తున్నాను. హిందీ, సంస్కృతాలు చదవుకుని అర్థంచేసుకునే జ్ఞానం ఉన్నందువల్ల కాశీ వాసం చేస్తూ కాశీ గురించి హిందీ లోను, సంస్కృతం లోను దొరికిన పుస్తకాలు చదివి వాటిని తెలుగులో రాసుకోవడం నా అలవాటు. ఆపుస్తకాలను చూసిన వారు వాటిని ప్రచురిస్తే బాగుంటుందనే సలహా ఇవ్వడంతో దానిని ప్రచురించే తలపుతో టైపు చెయ్యడం మొదలు పెట్టాము. తెలుగులో కూడా బ్లాగ్ సౌకర్యం ఉంది కాదా అని అది ప్రచురించే ముందు కొంతమంది చదివితే తప్పోప్పులు తెలుస్తాయనే ఉద్దేశ్యంతో బ్లాగులో పెట్టడం జరుగుతోంది.

మీరు ఈ శ్రీ కాశీ కేదార మహాత్మ్యము చదివి మీ అభిప్రాయములు తెలియ జేయగలరు.

ఇట్లు
అప్పేశ్వర శాస్త్రి

P.S. దీనిని టైపుచేసి పెట్టమని వేణుగోపాల్ ను కోరగా వారు దీనిని టైపుచేస్తూ చేసినది చేసినట్లుగా ఇంటర్నెట్ లో పెడితే మీకు ఏమయినా అభ్యంతరమా అని అడిగారు. అందరికీ ఈవిషయాలు తెలియాలనే కోరికతోనే దీనిని వ్రాసినందున, అంతర్జాలం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు చదువుకొనే అవకాశం ఉందని దానికి నా అనుమతిని తెలియ జేసాను. ఇందు ఏమయినా తప్పులు దొర్లిన మీరు తెలియ జేసిన వాటిని దిద్దుకుని అచ్చులో ఎక్కువ తప్పులు రాకుండా చూసుకుంటాము.

1 comment:

  1. వేణుగోపాల్‌గారు,

    మీరు కాశీలోనే వుంటారా? నేను తరచుగా కాశి వస్తుంటాను. బ్ర.వే.అప్పేశ్వర శాస్త్రిగారిని కాని మిమ్మల్ని కలిసే అవకాశం వుందా? మీకు అభ్యంతరం లేకపోతే వివరం తెలుపగలరు -

    satyaonline(at)gmail.com

    ReplyDelete